Rohit Sharma: సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన హిట్‌మ్యాన్.. టాప్ ప్లేస్‌లో ఎవరున్నారో తెలుసా?
Rohit Sharma: ఈ లిస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఇందుకోసం కేవలం 205 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకున్నాడు. టీమిండియా రన్ మెషీన్ తర్వాత హిట్ మ్యాన్ రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ వన్డేల్లో 10వేల పరుగులు పూర్తి చేసేందుకు 241 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. టీమిండియా దిగ్గజ స్టార్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్‌ల్లో 10వేల వన్డే పరుగులను చేరుకున్నాడు.

Asia Cup 2023, India vs Sri Lanka: ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతోన్న సూపర్ 4 మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 10,000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. మంగళవారం కొలంబో వేదికగా శ్రీలంకతో ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్ మ్యాచ్. ఈ ఫార్మాట్‌లో రోహిత్ తన 241వ ఇన్నింగ్స్‌లో ఒక సిక్సర్‌తో 23 పరుగులకు చేరుకున్న తర్వాత మైలురాయిని దాటాడు. 36 ఏళ్ల రోహిత్ శర్మ ఈ మైలురాయిని దాటిన ఆరో భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. వన్డేల్లో ఆడిన ఇన్నింగ్స్ పరంగా విరాట్ కోహ్లీ తర్వాత ఓవరాల్‌గా రెండవ భారత ఆటగాడిగా నిలిచాడు.
సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న మూడో భారత ఓపెనర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు.




రోహిత్ వన్డే పరుగులు..
View this post on Instagram
2007లో బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌పై అరంగేట్రం చేసినప్పటి నుంచి రోహిత్ 30 వన్డే సెంచరీలు, 50 అర్ధ సెంచరీలు దాదాపు 49 సగటుతో సాధించాడు.
10000 వన్డే పరుగులు (ఇన్నింగ్స్) అత్యంత వేగంగా పూర్తి చేసిన బ్యాటర్లు..
విరాట్ కోహ్లీ (భారత్) – 205 ఇన్నింగ్స్‌లు
రోహిత్ శర్మ (భారత్) – 241 ఇన్నింగ్స్
సచిన్ టెండూల్కర్ – 259 ఇన్నింగ్స్‌లు
సౌరవ్ గంగూలీ – 263 ఇన్నింగ్స్‌లు
రికీ పాంటింగ్ – 266 ఇన్నింగ్స్‌లు.
ఈ లిస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఇందుకోసం కేవలం 205 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకున్నాడు. టీమిండియా రన్ మెషీన్ తర్వాత హిట్ మ్యాన్ రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ వన్డేల్లో 10వేల పరుగులు పూర్తి చేసేందుకు 241 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. టీమిండియా దిగ్గజ స్టార్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్‌ల్లో 10వేల వన్డే పరుగులను చేరుకున్నాడు.
మ్యాచ్ పరిస్థితి..
He is on fire 🔥!
That’s a cracking half-century from #TeamIndia captain Rohit Sharma ⚡️ ⚡️
His 51st in ODIs 👍 👍
Follow the match ▶️ https://t.co/P0ylBAiETu #AsiaCup2023 | #INDvSL pic.twitter.com/ZxUHOR4N6p
— BCCI (@BCCI) September 12, 2023
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా 13 ఓవర్లు ముగిసే సిరికి ఒక వికెట్ కోల్పోయి 88 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 52, కోహ్లీ 2 పరుగులతో క్రీజులో నిలిచాడు. గిల్ 19 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
