World Cup 2023: వరల్డ్ కప్‌లో ఓపెనింగ్ వేడుకలు రద్దు.. స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేసిన ఐసీసీ.. అదేంటంటే?

ICC world cup 2023: అహ్మదాబాద్‌లో మొత్తం 10 జట్ల కెప్టెన్ల సమావేశం రేపు జరగనుంది. తొలిమ్యాచ్‌కు ముందు ఈ మీట్ నిర్వహించనున్నారు. ప్రపంచకప్‌కు సంబంధించి దీనికి ప్రత్యేక కారణం ఉంది. ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోనే జరగనుంది. అయితే రోహిత్ సేన తన ప్రచారాన్ని అక్టోబర్ 8న ప్రారంభించనుంది. ఆస్ట్రేలియాతో చెన్నైలో మొదటి మ్యాచ్ ఆడనుంది.

World Cup 2023: వరల్డ్ కప్‌లో ఓపెనింగ్ వేడుకలు రద్దు.. స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేసిన ఐసీసీ.. అదేంటంటే?
World Cup 2023
Follow us
Venkata Chari

|

Updated on: Oct 04, 2023 | 2:35 PM

World Cup 2023: ప్రపంచ కప్ 2023 కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో క్రికెట్ మహాసంగ్రామం మొదలుకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తొలి మ్యాచ్‌తో ఈ సంగ్రామం షురూ కానుంది. ఏ జట్టుకు ఎంత బలం ఉందో తేలిపోతుంది. అయితే, ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. అహ్మదాబాద్‌లో ప్రారంభ వేడుకకు సంబంధించి వినిపించిన వార్తలే నిజమయ్యాయి. ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్ అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ (England vs New Zealand) జట్ల మధ్య మాత్రమే జరుగుతుంది. అంతకు ముందు ప్రారంభ వేడుకలు మాత్రం జరగవని తెలుస్తోంది. అయితే, మొత్తం 10 జట్ల కెప్టెన్లు అహ్మదాబాద్ చేరకుంటారు. కానీ, ప్రారంభ వేడుకలు రద్దు కావడంతో వీళ్లంతా ఏం చేయనున్నారంటూ ఫ్యాన్స్ సందిగ్ధంలో పడుతున్నారు. దీని వెనుక ప్లాన్ ఏంటనేది ప్రశ్నగా మారింది.

ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌కు ముందు అన్ని జట్ల కెప్టెన్లు అహ్మదాబాద్ చేరుకోవడానికి కారణం కెప్టెన్స్ మీట్. నిజానికి ఇది ఐసీసీ సంప్రదాయం. ప్రారంభానికి ముందు, ప్రపంచకప్‌లో ఆడే అన్ని జట్ల కెప్టెన్ల సమావేశం ఉంటుంది. 2023 ప్రపంచకప్‌లో కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించారు.

అహ్మదాబాద్‌లో 10 జట్ల కెప్టెన్‌ల మీట్..

అహ్మదాబాద్‌లో జరగనున్న సమావేశానికి అన్ని జట్ల కెప్టెన్లు అక్కడికి చేరుకున్నారు. రోహిత్ శర్మ తిరువనంతపురం నుంచి నేరుగా అక్కడికి చేరుకున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్ తీసుకొచ్చారు. సమావేశానికి అహ్మదాబాద్ చేరుకున్న రోహిత్ శర్మ, బాబర్ ఆజం మొదటిసారి కలుసుకున్న సమయంలో ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు.

ఈ స్పెషల్ కార్యక్రమం ప్రారంభోత్సవం కాదు..

ప్రపంచ కప్ ప్రారంభ వేడుకలు జరగడం లేదనే విషయంపై ఇంతకుముందు చాలా ప్రకటనలు వినిపించాయి. అయితే వాస్తవానికి ప్రపంచకప్‌లో ఓపెనింగ్ సెర్మనీ లేదు. దాని స్థానంలో కెప్టెన్ మీట్ నిర్వహించనున్నారు. దీనిలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్..

ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఇందులో భారత్ తన ప్రచారాన్ని అక్టోబర్ 8 నుంచి ప్రారంభించనుంది. దీని తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో చెన్నైలో జరగనుంది. అక్టోబర్ 7న పాకిస్థాన్ జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది.

ప్రపంచకప్‌లో టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..