- Telugu News Photo Gallery Cricket photos CWC 2023: List of Indian players who might be playing their last ODI World Cup
ODI World Cup 2023: చివరిసారిగా వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్న క్రికెటర్లు వీరే.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే..?
ODI World Cup 2023: క్రికెట్ ప్రపంచమంతా వేచిచూస్తున్న వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ఇంకా కొన్ని గంటల నిరీక్షణే మిగిలి ఉంది. తమ అభిమాన జట్టు విజేతగా నిలుస్తుందని, అభిమాన బ్యాటర్ పరుగుల వర్షం కురిపిస్తాడని.. అక్టోబర్ 5 నుంచి జరిగే క్రికెట్ కార్నివల్‌పై ఇలా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో టైటిట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది టీమిండియా. అయితే భారత జట్టులోని ఓ ముగ్గురికి ఇదే చివరి మెగా టోర్నీ అని మీకు తెలుసా..? అవును, టీమిండియాకు వెన్నుముకగా మారి అనేక మ్యాచ్‌ల్లో గెలుపుకు కారణమైన ఆ ముగ్గురికి ఇదే చివరి వరల్డ్ కప్.
Updated on: Oct 04, 2023 | 1:51 PM

Team India, ODI World Cup 2023: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరిగే క్రికెట్ ప్రపంచ కప్ కోసం అన్ని జట్లూ ముమ్మరంగా సిద్ధమవుతున్నాయి. ఈ టోర్నీ కూడా ప్రతి ప్రపంచ కప్ మాదిరిగానే చాలా మంది ఆటగాళ్లకు చివరిది కానుంది. ఇలా చివరిసారిగా ప్రపంచ కప్ టోర్నీలో కనిపించబోతున్న ఆటగాళ్లలో భారత ప్లేయర్లు కూడా ఉన్నారు. వారెవరంటే..

రోహిత్ శర్మ: గత రెండేళ్లుగా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మకు దాదాపుగా ఇదే చివరి ప్రపంచ కప్. జూన్ 2007 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రోహిక్ శర్మకు ఇప్పటికే 36 సంవత్సరాలు. ఇప్పటికే టీ20 క్రికెట్‌లో కనిపించకుండా ఉన్న రోహిత్ వచ్చే వరల్డ్ కప్ 2027 వరకు వన్డే క్రికెట్ ఆడాలంటే అద్భుతాలు జరగాల్సిందే.

రవిచంద్రన్ అశ్విన్: 2011 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో సభ్యుడైన ఆర్ అశ్విన్‌కి 2023 టోర్నీలో ఆడే అవకాశమే అనూహ్యంగా లభించింది. క్రికెట్‌పై మక్కువతో జాతీయ జట్టులో స్థానం కోసం ప్రయత్నిస్తున్న యువ ఆటగాళ్ల సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో అశ్విన్ కెరీర్ త్వరలోనే ముగిసే అవకాశం కూడా ఉంది. కాబట్టి అశ్విన్‌కి కూడా ఇది చివరి ప్రపంచ కప్ కావచ్చు.

విరాట్ కోహ్లీ: ఈ లిస్టులో ఉండకూడని, ఉండాలని అనుకోని పేరు విరాట్ కోహ్లీ. తనదైన దూకుడుతో విరాట్ కోహ్లీ నుంచి రన్ మెషిన్, చేజ్ మాస్టర్, కింగ్ కోహ్లీగా అవతరించిన ఈ ఆటగాడు ఆటకు దూరం కావాలని ఏ ఒక్కరూ కోరుకోరు. కానీ ఇప్పటికే 35 సంవత్సరాల వయసు, 3 వరల్డ్ కప్ టోర్నీలు ఆడిన అనుభవం కలిగిన కోహ్లీ తన నాలుగో వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. 2011 ప్రపంచ కప్ విన్నింగ్ జట్టులో సభ్యుడైన కోహ్లీ ఈ టోర్నీ తర్వాత టెస్ట్ క్రికెట్‌లో మాత్రమే కనిపించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభమాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.





























