విచారణ సందర్భంగా డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకుని, నిత్యం మానసికంగా వేధిస్తోందంటూ ధావన్ తన భార్యపై చేసిన ఆరోపణలు నిజమేనని న్యాయమూర్తి హరీశ్ కుమార్ విశ్వసించరు. ఇంకా చెప్పాలంటే తన భర్త ధావన్ చేసిన ఆరోపణలు అబద్ధమని నిరూపించుకోవడంలో లేదా తన వాదన వినిపించడంలో అయేషా విఫలం అయ్యారు. భర్త చేసిన ఆరోపణలు కనీసం ఆమె ఖండించలేదు. తనని తాను రక్షించుకోవడంలో విఫలం అయింది. దీంతో మూడేళ్లుగా విడిగా ఉంటున్న ఈ దంపతులకు గ్రౌండ్ ఆఫ్ క్రూయెల్టీ కింద విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.