WPL 2026 : ఒకవైపు విజయం.. మరోవైపు విషాదం..గాయంతో ఆర్సీబీ నుంచి 85 లక్షల ప్లేయర్ అవుట్
WPL 2026 : విమెన్స్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ అదిరిపోయే రేంజ్‌లో మొదలైంది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా శుక్రవారం ప్రారంభమైన డబ్ల్యూపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లోనే ఆర్సీబీ అద్భుత విజయాన్ని అందుకుంది. గత సీజన్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించి టోర్నీని గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది.

WPL 2026 : విమెన్స్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ అదిరిపోయే రేంజ్‌లో మొదలైంది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా శుక్రవారం ప్రారంభమైన డబ్ల్యూపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లోనే ఆర్సీబీ అద్భుత విజయాన్ని అందుకుంది. గత సీజన్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించి టోర్నీని గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది. అయితే, ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ జట్టులో లేకపోవడం చర్చనీయాంశమైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆర్సీబీ హెడ్ కోచ్ మలోలన్ రంగరాజన్ దీనిపై స్పందిస్తూ, పూజా కనీసం రెండు వారాల పాటు ఆటకు దూరం కానుందని స్పష్టం చేశారు.
నిజానికి పూజా వస్త్రాకర్ గత కొన్ని రోజులుగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో భుజం గాయానికి చికిత్స పొందుతోంది. ఆ గాయం నుంచి కోలుకుని జట్టులో చేరుతుందనుకున్న తరుణంలో, హఠాత్తుగా ఆమెకు హాంస్ట్రింగ్ సమస్య (కండరాల నొప్పులు) తలెత్తింది. దీంతో ఆమె మరో 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్‌కు ఆడిన పూజాను, ఈసారి వేలంలో ఆర్సీబీ 85 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. కీలకమైన ఆల్‌రౌండర్ ఇలా సీజన్ ఆరంభంలోనే దూరం కావడం జట్టుకు పెద్ద లోటే.
పూజా లేకపోయినా మైదానంలో ఆర్సీబీ అమ్మాయిలు అదరగొట్టారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 154 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో ఆర్సీబీ ఒక దశలో 121 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ, సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ నడిన్ డిక్లర్క్ ఆఖరి ఓవర్లో విరుచుకుపడి జట్టును గెలిపించింది. చివరి ఓవర్లో 18 పరుగులు అవసరం కాగా, సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించి చివరి బంతికి ఫోర్ కొట్టి విజయాన్ని ఖాయం చేసింది. డిక్లర్క్ 63 పరుగులతో పాటు బౌలింగ్‌లో 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.
కేవలం ఆర్సీబీ మాత్రమే కాదు, ముంబై ఇండియన్స్ కూడా తమ స్టార్ ప్లేయర్ హేలీ మాథ్యూస్ సేవలను కోల్పోయింది. అనారోగ్యం కారణంగా ఆమె తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేదు. అయితే ఆమె తదుపరి మ్యాచ్ నాటికి కోలుకుంటుందని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఆర్సీబీ తన తదుపరి మ్యాచ్‌ను శనివారం (జనవరి 10) ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. పూజా వస్త్రాకర్ లేని లోటును జట్టు ఎలా భర్తీ చేస్తుందో వేచి చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి
