RCB vs SRH: ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఫిట్‌గా మారిన లక్కీ ప్లేయర్..
Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad: ఐపీఎల్ ప్లే-ఆఫ్‌లకు అందుబాటులో లేకపోవడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జాకబ్ బెథెల్ స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురువారం జట్టులోకి తీసుకుంది. అదనంగా, జట్టు కెప్టెన్ రజత్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నారని కోచ్ అధికారికంగా ప్రకటించాడు.

Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఇప్పుడు ప్లేఆఫ్ దశ వైపు కదులుతోంది. లీగ్‌లో ఇంకా 7 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కానీ నాలుగు ప్లేఆఫ్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్‌కు అర్హత సాధించాయి. ఈ సంవత్సరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టాప్ 4 జట్లు. కానీ, ప్లేఆఫ్‌లు దగ్గర పడుతున్న తరుణంలో, బెంగళూరుకు రెండు శుభవార్తలు అందాయి. ఐపీఎల్ ప్లేఆఫ్‌లకు అందుబాటులో లేని ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జాకబ్ బెథెల్ స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన టిమ్ సీఫెర్ట్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురువారం ఎంపిక చేసింది. అంతేకాకుండా, జట్టు కెప్టెన్ రజత్ పటాధర్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే ఈరోజు మ్యాచ్‌లో రజత్ కూడా మైదానంలో ఉండటం ఖాయం అని కోచ్ అధికారికంగా ప్రకటించాడు.
రజత్ పాటిదార్ నాయకత్వంలో, ఆర్‌సీబీ ఇప్పటివరకు అద్భుతంగా రాణించింది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. అయితే, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రజత్ వేలికి గాయమైంది. ఆ తరువాత, అతను పోటీలో పాల్గొనడంపై సందేహాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు జట్టు కోచ్ ఆండీ ఫ్లవర్ మాట్లాడుతూ రజత్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని చెప్ుపకొచ్చాడు.
“ఐపీఎల్ విరామం గురించి మేం ఆందోళన చెందడం లేదు. జట్టు సీజన్ అంతటా కష్టపడి పనిచేసింది. ఇప్పటివరకు అద్భుతంగా ప్రదర్శన ఇచ్చింది. ఈ విరామం కొంతమంది ఆటగాళ్లకు ఫిట్‌గా ఉండటానికి అవకాశం ఇచ్చింది. మే 17న జరగాల్సిన ఆర్‌సిబి, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేశారు. ఇది విరామాన్ని మరింత పొడిగించింది. ఇప్పుడు రజత్ పాటిదార్ బ్యాటింగ్‌కు ఫిట్‌గా ఉన్నాడు. ఇది మంచిది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ కూడా అనారోగ్యంతో ఉన్నాడు. కానీ, బ్రేక్ సమయంలో ఫిట్‌గా ఉండటానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు వారు పూర్తిగా ఫ్రెష్‌గా ఉన్నారు. ఆడటానికి సిద్ధంగా ఉన్నారు” అని అతను చెప్పుకొచ్చాడు.
ఆర్‌సీబీకి సొంత మైదానంలో మ్యాచ్‌లు లేవు..
ఆర్‌సీబీ ఇప్పుడు మిగిలిన అన్ని మ్యాచ్‌లను వారి సొంత మైదానానికి దూరంగా ఆడాలి. ఈ సవాలుకు జట్టు సిద్ధంగా ఉందని కోచ్ చెప్పుకొచ్చాడు. బెంగళూరులో వర్షం కారణంగా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. బెంగళూరులో మ్యాచ్ ఆడకపోవడం మాకు నిరాశ కలిగించిందని ఆయన అన్నారు. “ఇతర మైదానాల్లో మా రికార్డు అద్భుతంగా ఉంది. హైదరాబాద్‌పై జట్టు బాగా ఆడుతుందని మేం ఆశిస్తున్నాం” అని తెలిపాడు.
8 మ్యాచ్‌ల్లో గెలిచిన ఆర్‌సీబీ..
ఈ సీజన్‌లో ఆర్‌సీబీ మొత్తం 12 మ్యాచ్‌లు ఆడి 8 గెలిచి, మూడు ఓడిపోయింది. దీంతో బెంగళూరు ఖాతాలో 17 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ 0.482 ప్లస్ ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ రెండవ స్థానంలో ఉంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








