RCB vs SRH Preview: ఓడితే ప్లే ఆఫ్స్ నుంచి బెంగళూరు ఔట్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన హైదరాబాద్.. ఇరుజట్ల గణాంకాలు ఇవే?

|

Apr 15, 2024 | 10:38 AM

RCB vs SRH, IPL 2024: Head-to-Head Record: IPL చరిత్రలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్‌లను గెలుచుకోగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య ఒఖ మ్యాచ్ రద్దు అయింది. IPL 2023లో ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక మ్యాచ్‌లో RCB ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.

RCB vs SRH Preview: ఓడితే ప్లే ఆఫ్స్ నుంచి బెంగళూరు ఔట్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన హైదరాబాద్.. ఇరుజట్ల గణాంకాలు ఇవే?
Rcb Vs Srh Preview
Follow us on

Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad, 30th Match: IPL 2024లో, సీజన్‌లోని 30వ మ్యాచ్ ఏప్రిల్ 15న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (RCB vs SRH) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుత సీజన్‌లో ఆర్‌సీబీ ఆరు మ్యాచ్‌లు ఆడిన ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేయగలిగింది. అదే సమయంలో హైదరాబాద్ జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడగా మూడింటిలో విజయం సాధించింది.

ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. బెంగళూరు జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించే అంచున ఉంది. RCB బ్యాటింగ్, బౌలింగ్ రెండూ లయ తప్పినట్లు కనిపిస్తున్నాయి. కొన్ని మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్స్ రాణిస్తున్నా.. బౌలర్ల ప్రదర్శన పూర్తిగా పేలవంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరు జట్టు వీలైనంత త్వరగా సమష్టిగా రాణించాల్సి ఉంటుంది.

మరోవైపు, పాట్ కమిన్స్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు మంచి ప్రదర్శన కనబరిచింది. హైదరాబాద్ జట్టు తన గత రెండు మ్యాచ్‌లను గెలుచుకుంది. హైదరాబాద్ జట్టు నుంచి సమిష్టి ప్రదర్శన కనిపించింది. అందుకే కొన్ని మ్యాచ్‌లలో ప్రధాన పేర్లు ఫ్లాప్ అయినప్పటికీ, ఫలితం అనుకూలంగా వచ్చింది. కమిన్స్ తన జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించేలా చూసేందుకు ప్రయత్నిస్తాడు.

ఇవి కూడా చదవండి

IPL చరిత్రలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్‌లను గెలుచుకోగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య ఒఖ మ్యాచ్ రద్దు అయింది. IPL 2023లో ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక మ్యాచ్‌లో RCB ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.

IPL 2024 30వ మ్యాచ్ కోసం ఇరు జట్ల స్క్వాడ్‌లు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, కెమరూన్ గ్రీన్, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్వెస్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, వి విజయకుమార్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, లాకీ ఫెర్గూసన్, టామ్ కర్రాన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.

సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఐడెన్ మర్క్‌రామ్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హాక్ ఫరూకీ, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్, మయాంక్ అగర్వాల్, మయాంక్ మార్కండే, రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి సింగ్, షాబాజ్ అహ్మద్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఉపేంద్ర సింగ్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఝాతావేద్ సుబ్రమణియన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..