Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs GT: హాఫ్ సెంచరీతో చెలరేగిన లివింగ్ స్టోన్.. గుజరాత్‌ టార్గెట్ 170

RCB vs GT, IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 14వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గుజరాత్ టైటాన్స్ (GT) కు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది.

RCB vs GT: హాఫ్ సెంచరీతో చెలరేగిన లివింగ్ స్టోన్.. గుజరాత్‌ టార్గెట్ 170
Ipl 2025 Rcb Vs Gt
Follow us
Venkata Chari

|

Updated on: Apr 02, 2025 | 9:26 PM

RCB vs GT, IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 14వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గుజరాత్ టైటాన్స్ (GT) కు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది.

లియామ్ లివింగ్‌స్టోన్ (54) అర్ధ సెంచరీ సాధించాడు. జితేష్ శర్మ 33, టిమ్ డేవిడ్ 32 పరుగులు చేశారు. గుజరాత్ తరపున మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. సాయి కిషోర్ 2 వికెట్లు పడగొట్టాడు. అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీశారు.

ఇరుజట్ల ప్లేయింగ్-11

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటిదార్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్.

ఇవి కూడా చదవండి

ఇంపాక్ట్ ప్లేయర్స్: సుయాష్ శర్మ, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భాండాగే, జాకబ్ బెతేల్, స్వప్నిల్ సింగ్.

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.

ఇంపాక్ట్ ప్లేయర్స్: మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, వాషింగ్టన్ సుందర్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..