IPL 2023: బెంగళూరుకు భారీషాక్.. గాయపడిన తుఫాన్ సెంచరీ ప్లేయర్.. ఐపీఎల్ నుంచి ఔట్?
ఐపీఎల్ చివరి సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. కానీ ఫైనల్స్‌కు చేరుకోలేకపోయింది. అయితే ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు, జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగులుతున్నట్లు కనిపిస్తోంది.
ఐపీఎల్-2023కి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగులుతున్నట్లు కనిపిస్తోంది. గత సీజన్‌లో జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రజత్ పాటిదార్.. ఐపీఎల్ మొదటి కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండవచ్చు. రజత్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో పునరావాసం పొందుతున్నాడు. అతనికి చీలమండ గాయం ఉంది. ఐపీఎల్ తొలి అర్ధభాగంలో అతను దూరం కావచ్చని భావిస్తున్నారు. ESPNcricinfo వెబ్‌సైట్ తన నివేదికలో ఈ సమాచారాన్ని అందించింది.
వెబ్‌సైట్ నివేదిక ప్రకారం, పాటిదార్‌ను మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని కోరారు. దీంతో IPLలో పాల్గొనడంపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. RCB శిబిరంలో చేరడానికి ముందు రజత్ ఈ గాయంతో బాధపడ్డాడు. ఫ్రాంచైజీలో చేరడానికి ముందు అతనికి NCA నుంచి క్లియరెన్స్ అవసరం.
గతేడాది సెంచరీ సాధించాడు..
గత ఏడాది ప్లేఆఫ్స్‌లో సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్ రజత్.. IPL ఎలిమినేటర్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారతీయుడిగా నిలిచిన సంగతి తెలిసిందే. లక్నో సూపర్‌జెయింట్‌పై 49 బంతుల్లో సెంచరీ సాధించాడు. దీంతో ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో సెంచరీ చేసిన తొలి అన్‌క్యాప్‌డ్ ఇండియన్‌గా నిలిచాడు. ఒకవేళ రజత్ ఔట్ అయితే బెంగళూరుకు భారీ షాకే తగలనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రజత్ నంబర్-3లో ఆడటం వల్లనే గత సీజన్‌లో కోహ్లి కొన్ని మ్యాచ్‌లలో ఓపెనర్‌గా నిలిచాడు. ఇది కూడా జట్టును బలోపేతం చేసింది. మరి ఈ సమస్య నుంచి బెంగళూరు ఎలా బయటపడుతుందో చూడాలి.
టైటిల్ గెలిచేందుకు బెంగళూరు ఎదురుచూపులు..
ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవని జట్లలో బెంగళూరు కూడా ఒకటిగా నిలిచింది. ఈ జట్టు ఇప్పటి వరకు మూడుసార్లు ఐపీఎల్ ఫైనల్ ఆడినా విజయం సాధించలేదు. మొదటిసారిగా ఈ జట్టు 2009లో ఫైనల్ ఆడింది. ఆడమ్ గిల్‌క్రిస్ట్ కెప్టెన్సీలో డెక్కన్ చేజర్స్ చేతిలో ఓడిపోయింది. 2011లో మరోసారి మళ్లీ ఫైనల్‌కు చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత 2016లో కోహ్లీ జట్టు ఫైనల్ చేరినా సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..