AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024: పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా.. ఐపీఎల్ 2024లో తుఫాన్ ఇన్నింగ్స్‌..

Dinesh Karthik: సంవత్సరం 2004. భారత క్రికెట్ జట్టులో దినేష్ కార్తీక్ అనే యువ వికెట్ కీపర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన క్రికెట్ జీవితం వేగం పుంజుకొని గాడిలో పడింది. తరువాత, 2007లో తన చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజారాను పెళ్లాడాడు. దినేష్, నికిత తమ వైవాహిక జీవితం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. రంజీ ట్రోఫీలో తమిళనాడు జట్టుకు కూడా దినేష్ సారథిగా ఉండేవాడు. ఆ తర్వాత అదే జట్టులో భాగమయ్యాడు.. మురళీ విజయ్. అలా అనుకోకుండా ఒకరోజు నికిత.. దినేష్ కార్తీక్ తోటి ఆటగాడు మురళీ విజయ్‌ని కలిసింది.

T20 World Cup 2024: పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా.. ఐపీఎల్ 2024లో తుఫాన్ ఇన్నింగ్స్‌..
Dinesk Karthik T20i Wc
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Apr 19, 2024 | 10:58 AM

Share

T20 World Cup 2024: వయసులో పెద్దోడే కాని.. యువకులతోనే పోటీపడే ఆట అతడిది. దాదాపు ఫేడ్ఔట్‌‌ అయిన దగ్గర నుంచి.. మళ్లీ ఎగసిపడే ఆటతీరును కనబరుస్తున్న అతడు ఓ వారియరే. అలాగని కేవలం ఆటతో మాత్రమే కాదు.. అతడి లైఫ్ స్టోరీ.. ఎందరో యువకులకు ఇప్పుడొక ఇన్ స్పిరేషన్.. దినేష్ కార్తిక్ అందరి క్రికెటర్ల లాంటి క్రికెటర్ కాదు.. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన వ్యక్తి.. తన స్నేహితుడు, తోటి ఆటగాడు మురళీ విజయ్ చేసిన నమ్మక ద్రోహానికి బలయ్యాడు. ఫ్రెండే కదాని దగ్గరకు తీస్కుంటే.. దినేష్ అర్ధాంగినే తీసుకెళ్లిపోయిన ఘనుడు మురళీ.

సంవత్సరం 2004. భారత క్రికెట్ జట్టులో దినేష్ కార్తీక్ అనే యువ వికెట్ కీపర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన క్రికెట్ జీవితం వేగం పుంజుకొని గాడిలో పడింది. తరువాత, 2007లో తన చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజారాను పెళ్లాడాడు. దినేష్, నికిత తమ వైవాహిక జీవితం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. రంజీ ట్రోఫీలో తమిళనాడు జట్టుకు కూడా దినేష్ సారథిగా ఉండేవాడు. ఆ తర్వాత అదే జట్టులో భాగమయ్యాడు.. మురళీ విజయ్. అలా అనుకోకుండా ఒకరోజు నికిత.. దినేష్ కార్తీక్ తోటి ఆటగాడు మురళీ విజయ్‌ని కలిసింది. నికితకు మురళీ విజయ్ అంటే ఇష్టం ఏర్పడింది. ఈ విషయాన్ని దినేష్ కార్తీక్ గుర్తించలేకపోయాడు. నికిత, మురళి మధ్య సాన్నిహిత్యం పెరగడం ప్రారంభించింది. తక్కువ కాలంలోనే వారి అనుబంధం ప్రారంభమైంది. ఇద్దరూ బహిరంగంగా కలవడం ప్రారంభించారు. మురళీ విజయ్ తన కెప్టెన్ దినేష్ భార్య నికితతో ప్రేమలో ఉన్నాడని దినేష్ కార్తీక్ తో పాటు తమిళనాడు జట్టు మొత్తానికి తెలిసింది.

తన చిన్ననాటి స్నేహితుడు చేసిన దారుణ మోసం నుంచి ఎలా బయట పడాలో అర్ధం కాక.. డిప్రెషన్‌లోకి వెళ్లాడు. నికితకు విడాకులిచ్చే సమయానికి ఆమె గర్భవతి. చేసేది లేక.. ఆమె నుంచి దూరమైన దినేష్.. తర్వాత తీవ్ర బాధలోకి జారుకున్నాడు. ఒక దశలో దినేష్‌కి క్రికెట్ దూరమైపోయింది. అంచెలంచెలుగా ఎదుగుతూ రావల్సిన వాడుకాస్తా.. క్రికెట్‌కే దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఇండియన్ క్రికెట్ నుంచి మాత్రమే కాదు రంజీల నుంచి కూడా సైడైపోయాడు. దారుణ విషయం ఏంటంటే.. తమిళనాడు కెప్టెన్ గా అతడి స్థానంలో మురళీ విజయ్ సెలెక్టయ్యాడు. దీంతో దినేష్ కార్తీక్ నైరాశ్యంలోకి వెళ్లాడు. మద్యానికి అలవాటయ్యాడు. ఆత్మహత్య గురించి కూడా ఆలోచన చేయడం ప్రారంభించాడు.

ఇవి కూడా చదవండి

ఈ విషయం తెలిసిన ట్రైనర్.. దినేష్‌ను కలిసి.. తిరిగి జిమ్‌కి రావల్సిందిగా కోరాడు. అతడు ఒప్పుకోకున్నా బలవంతానా జిమ్ కి వచ్చేలా చేశాడు. ఎప్పటిలాగానే మాములు మనిషి అయ్యే క్రమంలో అతడికో తోడు దొరికింది. ఆ తోడు నీడ పేరే దీపిక పల్లికల్. దీపిక మహిళల ఇండియన్ స్క్వాష్ ఛాంపియన్. బేసిగ్గా క్రికెటర్లంటే పెద్ద అభిప్రాయం లేని.. దీపికకు ఎందుకనో దినేష్‌ను చూడగానే ఒకింత మంచి అభిప్రాయం ఏర్పడింది. దీంతో అతడితో ఫ్రెండ్షిప్.. అప్పటి నుంచి దినేష్ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం మొదలైంది. ఇరువురి మనసులు కలిశాయి. దీపిక- దినేష్ ల పెళ్లికి మార్గం సుగమం అయ్యింది. ఇద్దరి వివాహ బంధం ముడి పడ్డంతో.. తిరిగి దినేష్ కార్తిక్ ఎప్పటిలాగానే తనదైన ఛాంపియన్ ఆటతీరును కొనసాగించడం మొదలు పెట్టాడు. ఈ దంపతులకు కవలలు కూడా జన్మించారు. వారి దాంపత్య జీవితం హ్యాపీగా సాగుతోంది.

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తిక్ దుమ్మురేపుతున్నాడు. లేటు వయసుల్లో లేటెస్ట్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను భయకంపితులు చేస్తున్నాడు. తుపాన్ బ్యాటింగ్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. గత రెండు మ్యాచుల్లో మెరుపు హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించేందుకు వీరుడిలా ప్రయత్నించాడు. మ్యాచ్ ఓడినా.. డీకే పోరాటానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచులు ఆడిన దినేశ్ కార్తిక్.. 226 రన్స్ చేశాడు. 200లకు పైగా స్ట్రైక్ రేటుతో ఈ పరుగులు సాధించాడు. దీంతో అత్యధిక పరుగుల వీరుల్లో టాప్-10లో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీతో పాటు RCBలో నిలకడగా రాణిస్తూ.. ఫ్యాన్స్‌తో జేజేలు కొట్టించుకుంటున్నాడు. ముఖ్యంగా సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో దినేశ్ కార్తిక్ పోరాటం న భూతో న భవిష్యతి అనే రేంజ్‌లో ఉంది. 38 ఏళ్ల దినేశ్ కార్తిక్.. 35 బంతుల్లో 83 రన్స్ చేశాడు. ఈ మ్యాచులో డీకే ఔట్ అయ్యాక.. చిన్నస్వామి స్టేడియంలోని అభిమానులు అంతా అతడికి స్టాడింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఈ సీజన్‌లో 108 మీటర్ల భారీ సిక్స్ కొట్టిన డీకే.. IPL 2024లో లాంగెస్ట్ సిక్స్‌ను నమోదు చేశాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో వికెట్ కీపర్ బెర్తు కోసం బలమైన కాంపిటేటర్‌గా మారాడు. దినేశ్ కార్తిక్ ఫామ్ చూసిన అభిమానులు.. అతడిని ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే జోరు డీకే కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదని కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us