IPL 2023: రోహిత్ శర్మ సరసన చేరిన దినేష్ కార్తీక్.. చెత్త రికార్డులో టాప్ 5 ప్లేయర్స్ వీరే.. అదేంటంటే?
RR vs RCB: ఐపీఎల్ 16వ సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో భాగమైన వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్‌కు చాలా దారుణంగా తయారైంది. రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు.
Dinesh Karthik: ఐపీఎల్ 16వ సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో భాగమైన వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్‌కు చాలా దారుణంగా తయారైంది. రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో ఇప్పుడు ఐపీఎల్‌లో 16 సార్లు జీరోకే ఔట్ అయ్యాడు. దీంతో కార్తీక్ పేరుతో చెత్త రికార్డు నమోదైంది.
రాజస్థాన్ రాయల్స్‌కు వ్యతిరేకంగా దినేష్ కార్తీక్‌ను లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. దీంతో ఐపీఎల్‌లో 16 సార్లు సున్నాతో ఔట్ అయిన విషయంలో కార్తీక్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను సమం చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు సున్నాకి అవుటైన ఆటగాళ్ల జాబితాలో కార్తీక్, రోహిత్ ఇప్పుడు సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచారు.
ఈ జాబితాలో దినేష్ కార్తీక్, రోహిత్ శర్మ 16 డకౌట్‌లతో తొలి స్థానంలో ఉన్నారు. మరోవైపు ఈ జాబితాలో మూడో స్థానంలో మన్‌దీప్ సింగ్, నాలుగో స్థానంలో సునీల్ నరైన్, 5వ స్థానంలో అంబటి రాయుడు ఉన్నారు. ఐపీఎల్‌లో ఈ ముగ్గురు ఆటగాళ్లు ఇప్పటి వరకు 15 సార్లు డకౌట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నారు.
ఈ 16వ సీజన్‌లో దినేష్ కార్తీక్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకోవడం ఇది మూడోసారి జరిగింది. అంతకుముందు 2020 సంవత్సరంలో ఆడిన ఐపీఎల్ సీజన్‌లో, కార్తీక్ ఖాతా తెరవకుండానే 3 సార్లు పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్‌ల్లో కార్తీక్ బ్యాట్ నుంచి 140 పరుగులు మాత్రమే వచ్చాయి.
2020 IPL సీజన్ నుంచి, IPLలో రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ బౌలర్ ముందు దినేష్ కార్తీక్ చాలా పేలవమైన రికార్డును పొందాడు. 77 బంతులు ఎదుర్కొన్న కార్తీక్ కేవలం 5.63 సగటుతో 62 పరుగులు చేసి 11 సార్లు ఔట్ అయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..