RCB vs CSK: ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో ఆర్‌సీబీ.. కట్‌చేస్తే.. డేంజరస్ ఓపెనర్ రీ ఎంట్రీ?
RCB Opener Phil Salt Fewer Update, RCB vs CSK: ఐపీఎల్ 2025 సీజన్‌లో 52వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు, ఫిల్ సాల్ట్ రీఎంట్రీపై కీలక అప్‌డేట్ వచ్చింది.

RCB vs CSK: ఐపీఎల్ 2025 సీజన్‌లో 52వ మ్యాచ్ ఆర్‌సీబీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఆర్‌సీబీ జట్టు తరపున చివరి మ్యాచ్‌లో డాషింగ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ జ్వరం కారణంగా ఆడలేకపోయాడు. మే 3న చెన్నైతో జరిగే మ్యాచ్‌కు ముందు దేవదత్ పడిక్కల్ ఫిల్ సాల్ట్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చాడు.
దేవదత్ పడికల్ కీలక అప్‌డేట్..
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఫిల్ సాల్ట్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. కానీ, జ్వరం కారణంగా ఢిల్లీతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆర్‌సీబీ తరపున ఆడలేకపోయాడు. ఇప్పుడు చెన్నైతో మ్యాచ్‌కు ముందు, దేవదత్ పడిక్కల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అతను ప్రస్తుతం వైద్య బృందంతో సంప్రదింపులు జరుపుతున్నాడు. త్వరలో తిరిగి వస్తాడు’ అని తెలిపాడు.
అదే సమయంలో, దేవదత్ పడిక్కల్ తన తుఫాను బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ, ‘ గత కొన్ని సంవత్సరాలుగా, నేను ఐపీఎల్ ముందు పెద్దగా సన్నద్ధం చేయలేకపోయాను. కానీ, ఈ సంవత్సరం ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు, నేను చాలా కష్టపడి పనిచేశాను. తగినంత సమయం దొరికింది. కాబట్టి, నా బ్యాటింగ్‌పై పని చేయడం నాకు నిజంగా సహాయపడింది’ అంటూ చెప్పుకొచ్చాడు.
ప్లేఆఫ్స్‌కు అడుగు దూరంలో ఆర్‌సీబీ..
ఈ సీజన్‌లో ఆర్‌సీబీ తరపున ఫిల్ సాల్ట్ ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌ల్లో 239 పరుగులు చేశాడు. కానీ, అతను ఢిల్లీతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. కాబట్టి, ఇప్పుడు చెన్నైతో జరిగే కీలక మ్యాచ్‌లో అతను తిరిగి రావచ్చు. ఆర్‌సీబీ చెన్నైతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే, ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరుకోవడానికి 16 పాయింట్లు సాధించిన మొదటి జట్టుగా నిలుస్తుంది. మరోవైపు, చెన్నై జట్టు పరిస్థితి దారుణంగా ఉంది. పది మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కాగా, చెన్నై IPL 2025 సీజన్ నుంచి తప్పుకుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




