AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 RCB :ప్లేఆఫ్స్ వేళ బెంగళూరుకు పిడుగులాంటి వార్త.. కెప్టెన్ రజత్ పాటిదార్ మిస్సింగ్?

IPL 2026 RCB : ఐపీఎల్ 2026 కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ జట్టుతో కనిపించకపోవడం కలకలం రేపుతోంది. అతను గాయం కారణంగా దూరం కానున్నాడా? మరి కెప్టెన్ ఎవరు? అని సోషల్ మీడియాతో తెగ చర్చ నడుస్తోంది.

IPL 2026 RCB :ప్లేఆఫ్స్ వేళ బెంగళూరుకు పిడుగులాంటి వార్త.. కెప్టెన్ రజత్ పాటిదార్ మిస్సింగ్?
Rcb (5)
Rakesh
|

Updated on: May 17, 2026 | 12:14 PM

Share

IPL 2026 RCB : ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశకు చేరుకున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు ఒక ఆందోళనకరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ రోజు (మే 17) ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ జట్టుతో లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. టీమ్ ట్రావెల్ వీడియోలో కానీ, ప్రాక్టీస్ సెషన్‌లో కానీ పాటిదార్ కనిపించకపోవడంతో అతను గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడనే వార్తలు జోరందుకున్నాయి.

ఏం జరిగింది? పాటిదార్ ఎక్కడ?

ఆర్సీబీ మేనేజ్‌మెంట్ తాజాగా విడుదల చేసిన ట్రావెల్ వీడియోలు, ధర్మశాల ప్రాక్టీస్ విజువల్స్‌లో కెప్టెన్ రజత్ పాటిదార్ ఎక్కడా కనిపించలేదు. సాధారణంగా ప్రతి మ్యాచ్‌కు ముందు కెప్టెన్ యాక్టివ్‌గా కనిపిస్తారు, కానీ పాటిదార్ గైర్హాజరీపై అభిమానులు సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలుపెట్టారు. దీనిపై ఫ్రాంచైజీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఒకవేళ అతను ఈ మ్యాచ్‌కు దూరమైతే జట్టు పగ్గాలు ఎవరు అందుకుంటారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.

ఆర్సీబీకి ఇదే అతి పెద్ద మ్యాచ్

పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ, ఇవాళ పంజాబ్ కింగ్స్‌పై గెలిస్తే అధికారికంగా ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయిన మొదటి జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. ఇలాంటి చారిత్రాత్మక మ్యాచ్‌కు ముందు కెప్టెన్ దూరం కావడం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే. ఇప్పటికే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పాటిదార్, ఈ సీజన్‌లో మూడు హాఫ్ సెంచరీలతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.

కెప్టెన్సీ రేసులో ఎవరున్నారు?

పాటిదార్ ఒకవేళ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోతే, వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ జట్టును నడిపించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే టీమ్‌లో విరాట్ కోహ్లీ వంటి అనుభవజ్ఞుడైన ప్లేయర్ ఉండటంతో, నిర్ణీత కెప్టెన్ లేని పక్షంలో కోహ్లీ మళ్ళీ బాధ్యతలు చేపడతారా? లేదా మరొకరికి ఛాన్స్ ఇస్తారా? అనేది టాస్ సమయంలోనే తేలనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై