Ravi Shastri: రాహుల్ ద్రవిడ్‌కు మాజీ కోచ్ సలహా.. సరైన ఆటగాళ్లను ఎంచుకోవాలని సూచన..

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ టైటిల్‌కు పోటీదారుగా బరిలోకి దిగినప్పటికీ సెమీఫైనల్‌కు కూడా చేరలేకపోయింది.

Ravi Shastri: రాహుల్ ద్రవిడ్‌కు మాజీ కోచ్ సలహా.. సరైన ఆటగాళ్లను ఎంచుకోవాలని సూచన..
Ravi Shastri
Follow us

|

Updated on: Jan 28, 2022 | 7:48 PM

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ టైటిల్‌కు పోటీదారుగా బరిలోకి దిగినప్పటికీ సెమీఫైనల్‌కు కూడా చేరలేకపోయింది. ఇంతలో కోహ్లీ(virat kohli) టీ20 కెప్టెన్సీని వదులుకున్నాడు. ఆ తర్వాత వన్డే జట్టు కెప్టెన్సీ అతన్ని దొలగించారు. ఈ సమయంలో రాహుల్ ద్రవిడ్(rahul dravid) ప్రధాన కోచ్‌గా జట్టులోకి బాధ్యతలు తీసుకున్నారు. దక్షిణాఫ్రికా టూర్‌లో టీమ్‌ఇండియా టెస్టు, వన్డే గెలుస్తుందని భావించారు కానీ రెండు సిరీస్‌లను టీమిండియా కోల్పోయింది. టెస్టు సిరీస్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టు మారుతున్న తరుణంలో రాహుల్‌ ద్రవిడ్ కంటే ముందు ప్రధాన కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి(ravi shastri ) అతడికి ప్రత్యేక సలహా ఇచ్చాడు.

విరాట్ కోహ్లీ తర్వాత కొత్త కెప్టెన్ కోసం అన్వేషణలో ఉన్న టీమిండియా.. ఈలోగా భవిష్యత్తులో జట్టుకు విజయాన్ని అందించే కొత్త ఆటగాళ్ల కోసం కూడా వెతుకుతోంది. ఈ బాధ్యతలన్నింటి భారం రాహుల్‌పై ఉందని సరైన ఆటగాళ్లను ఎంచుకోవాలని శాస్త్రి అతనికి సలహా ఇచ్చాడు.

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానెల్‌లో శాస్త్రి మాట్లాడుతూ.. ‘భారత జట్టుకు ఇది చాలా ముఖ్యమైన సమయం. రాబోయే ఎనిమిది-10 నెలలు మార్పుకు సమయం. భారత క్రికెట్‌ను నాలుగు-ఐదేళ్లు ముందుకు తీసుకెళ్లే సరైన ఆటగాళ్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం. యువకులు, అనుభవజ్ఞులైన ఆటగాళ్ల కలయిక ఉండాలని నేను ఎప్పుడూ నమ్ముతాను. కొన్నిసార్లు మీరు భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు, మార్పు అవసరం. ఇది సమయం. వచ్చే ఆరు నెలల పాటు యువ ఆటగాళ్లను చూడాల్సిందే. అని చెప్పాడు.

T20 ప్రపంచ కప్ ఈ సంవత్సరం ఆస్ట్రేలియాలో జరగనుంది. 2023లో భారత్ స్వదేశంలో వన్డే ప్రపంచకప్ ఆడాల్సి ఉంది. 2011 నుంచి భారత్ వన్డే ప్రపంచకప్ గెలవలేదు. ఈ రెండు ప్రపంచకప్‌లకు టీమ్‌ఇండియా సన్నద్ధం కావల్సి ఉంది.

Read Also.. Brendan Taylor: క్రికెటర్ బ్రెండన్ టేలర్‌పై ఐసీసీ నిషేధం.. ఎందుకంటే..

టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!