AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranji Trophy: ఆ రంజీ జట్టులో సచిన్ తనయుడు.. జనవరి 13న అరంగేట్రం చేసే అవకాశం..!

దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వచ్చే రంజీ ట్రోఫీ సీజన్‌లో ముంబై జట్టులోకి ఎంపికయ్యాడు.

Ranji Trophy: ఆ రంజీ జట్టులో సచిన్ తనయుడు.. జనవరి 13న అరంగేట్రం చేసే అవకాశం..!
Arjun Tendulkar
Venkata Chari
| Edited By: Team Veegam|

Updated on: Dec 30, 2021 | 3:25 PM

Share

Arjun Tendulkar: దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వచ్చే రంజీ ట్రోఫీ సీజన్‌లో ముంబై జట్టులోకి ఎంపికయ్యాడు. సలీల్ అంకోలా నేతృత్వంలోని ముంబై సీనియర్ సెలక్షన్ కమిటీ బుధవారం 20 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

జనవరి 13 నుంచి మహారాష్ట్రతో ముంబై తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. తొలి రెండు మ్యాచ్‌లకు జట్టును ఎంపిక చేశారు. ఐపీఎల్ చివరి సీజన్ కోసం అర్జున్ ముంబై ఇండియన్స్ జట్టులో కూడా భాగమయ్యాడు. కానీ, ఒక్క మ్యాచ్‌లోనూ అతనికి అవకాశం రాలేదు.

తుషార్ దేశ్‌పాండే స్థానంలో అర్జున్‌కు అవకాశం.. సలీల్ అంకోలా మాట్లాడుతూ – అర్జున్ గత కొంతకాలంగా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. మధ్యలో గాయపడినా.. వచ్చిన అవకాశంతో బాగానే ఆకట్టుకున్నాడు. ముంబై అనుభవజ్ఞుడైన బౌలర్ తుషార్ దేశ్ పాండే గాయం కారణంగా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో అతని స్థానంలో అర్జున్‌కి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

కరోనా కారణంగా గతేడాది అరంగేట్రం చేయలేకపోయిన అర్జున్ గతేడాది కూడా ముంబై జట్టులోకి వచ్చాడు. కానీ, కరోనా మహమ్మారి కారణంగా బీసీసీఐ రంజీ ట్రోఫీ టోర్నీని నిర్వహించలేదు. ఈ ఏడాది రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు తటస్థ వేదికలపైనే జరగనున్నాయి.

ముంబై జట్టు పృథ్వీ షా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, డ్రూ గోమెల్, అర్మాన్ జాఫర్, సర్ఫరాజ్ ఖాన్, సచిన్ యాదవ్, ఆదిత్య తారే, హార్దిక్ తమోర్, శివమ్ దూబే, అమన్ ఖాన్, షామ్స్ మూలాన్, తనుష్ కొటాన్, ప్రశాంత్ సోలంకి, శశాంక్ అత్తార్డే, ధవల్ కుల్కర్ని, మోహిత్ అవస్థి, ప్రిన్స్ బదానీ, సిద్ధార్థ్ రౌత్, రాయిస్టన్ డయాస్, అర్జున్ టెండూల్కర్.

Also Read: IND vs SA: చివరి రోజుకు చేరిన ఫలితం.. విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్.. విదేశాల్లో బుమ్రా స్పెషల్ రికార్డ్..!

Shami: విధ్వంసం సృష్టిస్తున్న ఫాస్ట్ బౌలర్లు.. బాక్సింగ్ డే టెస్టుల్లో చెలరేగిన బోలాండ్, స్టార్క్, షమీ, ఎంగిడి..