AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : మోదీ ఒక్క మాట చెబితే చాలు..పాకిస్తాన్లో క్రికెట్ నామరూపాల్లేకుండా పోతుంది..వాస్తవం ఒప్పుకున్న పాక్ ప్లేయర్

IND vs PAK : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆవేశంలో తీసుకున్న ఒక నిర్ణయం ప్రస్తుతం ఆ దేశ క్రికెట్ భవిష్యత్తునే ప్రమాదంలో పడేసింది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో ఆడే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్న పాకిస్థాన్‌కు, అసలు తత్వం ఇప్పుడు బోధపడుతుంది.

IND vs PAK : మోదీ ఒక్క మాట చెబితే చాలు..పాకిస్తాన్లో క్రికెట్ నామరూపాల్లేకుండా పోతుంది..వాస్తవం ఒప్పుకున్న పాక్ ప్లేయర్
Pm Modi
Rakesh
|

Updated on: Feb 03, 2026 | 2:29 PM

Share

IND vs PAK : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆవేశంలో తీసుకున్న ఒక నిర్ణయం ప్రస్తుతం ఆ దేశ క్రికెట్ భవిష్యత్తునే ప్రమాదంలో పడేసింది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో ఆడే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్న పాకిస్థాన్‌కు, అసలు తత్వం ఇప్పుడు బోధపడుతుంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. భారత్ తలచుకుంటే పాక్ క్రికెట్ నామరూపాలు లేకుండా పోతుందని ఆయన చేసి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా గతంలోనే ఒక చేదు నిజాన్ని ఒప్పుకున్నారు. ఐసీసీకి వచ్చే నిధుల్లో 90 శాతం భారత మార్కెట్ నుండే వస్తాయి. ఐసీసీ తన దగ్గరున్న నిధులను అన్ని దేశాలకు పంచుతుంది. అలా పాక్ బోర్డుకు అందే నిధుల్లో సగం కంటే ఎక్కువ వాటా భారత్ పరోక్షంగా ఇస్తున్నదే. “ఒకవేళ భారత ప్రధాని మోదీ గారు.. పాకిస్థాన్‌కు నిధులు వెళ్లకూడదని ఒక్క మాట చెబితే, పాక్ క్రికెట్ బోర్డు మరుసటి రోజే కుప్పకూలిపోతుంది” అని రమీజ్ రాజా ఆ వీడియోలో స్పష్టంగా చెప్పారు. అంటే పాక్ క్రికెటర్ల జీతాల నుంచి బోర్డు నిర్వహణ దాకా అంతా భారత్ పెట్టే భిక్షేనని ఆయన అంగీకరించారు.

2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాక్ ప్రకటించడం ఆ దేశానికే శాపంగా మారనుంది.. భారత్-పాక్ మ్యాచ్ అంటేనే వేల కోట్ల రూపాయల ఆదాయం. ఈ మ్యాచ్ జరగకపోతే ఐసీసీకి భారీ నష్టం వాటిల్లుతుంది. దీనివల్ల పాక్ సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం కూడా ఐసీసీకి ఉంటుంది. అంతేకాదు పాకిస్థాన్‌కు వచ్చే వార్షిక నిధులను ఐసీసీ నిలిపివేస్తే, అక్కడ డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. పీఎస్‌ఎల్ వంటి లీగ్‌లకు కూడా స్పాన్సర్లు దొరకడం గగనమైపోతుంది.

తమ నిర్ణయానికి మద్దతు ఇవ్వాలంటూ పాక్ బోర్డు అధికారులు ఇతర దేశాల క్రికెట్ బోర్డులకు ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. కానీ ఏ ఒక్క దేశం కూడా పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. బీసీసీఐతో పెట్టుకుంటే తమ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి పెద్ద బోర్డులు కూడా భయపడుతున్నాయి. ఫలితంగా పాక్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఒంటరి అయిపోయింది.

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పాక్ బోర్డుకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. భారత్‌తో ఆడకపోతే వచ్చే ఆర్థిక నష్టాన్ని భరించే శక్తి పాక్‌కు లేదు. అందుకే ఆవేశంలో తీసుకున్న ఈ నిర్ణయం నుంచి ఎలా బయటపడాలా అని పీసీబీ అధికారులు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. త్వరలోనే నిబంధనల మేరకు ఆడతాం అంటూ పాక్ యూ టర్న్ తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి

Follow Us
మేకప్ లేకుండా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. ఫొటోస్ ఇదిగో
మేకప్ లేకుండా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. ఫొటోస్ ఇదిగో
భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం..
భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం..
ట్యాన్‌ తొలగించే సింపుల్ ఇంటి చిట్కాలు.. ఇలా ట్రై చేశారంటే...
ట్యాన్‌ తొలగించే సింపుల్ ఇంటి చిట్కాలు.. ఇలా ట్రై చేశారంటే...
ఫ్రిజ్ Vs మట్టి కుండ నీరు.. ఆరోగ్యానికి ఏది నిజమైన అమృతం..?
ఫ్రిజ్ Vs మట్టి కుండ నీరు.. ఆరోగ్యానికి ఏది నిజమైన అమృతం..?
మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?
మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?
గీత గోవిందం ప్రేమ ప్రయాణం.. విజయ్ రష్మికల ఏడడుగుల బంధం..
గీత గోవిందం ప్రేమ ప్రయాణం.. విజయ్ రష్మికల ఏడడుగుల బంధం..
ఒకవైపు కల్తీ మద్యం కాటు… మరోవైపు కాస్ట్లీ బ్రాండ్ల అక్రమ రవాణా!
ఒకవైపు కల్తీ మద్యం కాటు… మరోవైపు కాస్ట్లీ బ్రాండ్ల అక్రమ రవాణా!
ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి.. తల్లి వెళ్లి చూసేసరికే ఊహించని..
ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి.. తల్లి వెళ్లి చూసేసరికే ఊహించని..
సమస్తం కల్తీ మయం! మన కిచెన్‌లోనే ఇన్ని కల్తీలా.?
సమస్తం కల్తీ మయం! మన కిచెన్‌లోనే ఇన్ని కల్తీలా.?
సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.. ఫొటోస్
సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.. ఫొటోస్