IPL 2023: క్రికెట్ నేర్చుకోవడానికి పానీపూరీ అమ్మాడు.. కట్‌చేస్తే.. ఐపీఎల్‌లో కోట్లు ఆర్జిస్తున్నాడు.. త్వరలో టీమిండియాలోకి?
Yashasvi Jaiswal Net Worth: ఐపీఎల్-2023లో ఆదివారం రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌పై వాంఖడే స్టేడియంలో అతను ఈ సెంచరీని సాధించాడు. ఈ సీజన్‌లో జైస్వాల్ అద్భుతమైన ఆటను కనబరుస్తున్నాడు.
Yashasvi Jaiswal Net Worth: ఐపీఎల్-2023లో ఆదివారం రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌పై వాంఖడే స్టేడియంలో అతను ఈ సెంచరీని సాధించాడు. ఈ సీజన్‌లో జైస్వాల్ అద్భుతమైన ఆటను కనబరుస్తున్నాడు. అయితే ఒకప్పుడు జైస్వాల్‌కు నివసించడానికి కూడా స్థలం లేదు. ఇప్పుడు అతని రోజులు పూర్తిగా మారాయి.
జైస్వాల్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని భదోహి. అయితే క్రికెట్ ఆడేందుకు ముంబై వచ్చాడు. అక్కడ అతను ఆజాద్ మైదాన్‌లో ఒక గుడారంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. గోల్గప్పలను కూడా విక్రయించేవాడు. ఒకప్పుడు జైస్వాల్‌కి రెండు పూటలా భోజనం చేయడమే కష్టంగా ఉండేది. కానీ, నేడు కోట్లు సంపాదిస్తూ క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.
నికర విలువ..
తొలినాళ్లలో తిండికి, నిద్రకు ఇబ్బంది పడిన యశస్వి నేడు అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఈరోజు అతని నికర విలువను చూస్తే, 2022 వరకు అది దాదాపు 10.73 కోట్లు. యశస్వికి క్రికెట్ మాత్రమే ఆదాయ వనరు. ఈ యువ బ్యాట్స్‌మెన్ 2020లో అండర్-19 ప్రపంచకప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఫైనల్స్‌కు చేరిన తర్వాత ఈ జట్టు ఓడిపోయింది. ఇక్కడి నుంచి అతడి అదృష్టం మారిపోయింది.
ఈ ప్రపంచకప్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ అతడిని రూ.2.40 కోట్లకు కొనుగోలు చేసింది. రాజస్థాన్ మళ్లీ తన వేతనాన్ని పెంచింది. 2022లో రూ.4 కోట్లు చెల్లించి ఈ ఆటగాడిని తన వద్ద ఉంచుకుంది. అంటే, 2020 నుంచి గత సీజన్ వరకు, యశస్వి IPL నుంచి మొత్తం 8.80 కోట్లు సంపాదించాడు. ఈ సీజన్‌లో కూడా అతనికి ఫ్రాంచైజీ నాలుగు కోట్లు ఇవ్వనుంది.
యశస్వి దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరపున ఆడుతున్నాడు. ఇక్కడి నుంచి కూడా సంపాదిస్తున్నారు. యశస్వి ఇప్పటి వరకు దేశవాళీ క్రికెట్‌లో మొత్తం 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల కంటే తక్కువ ఆడే ఆటగాళ్లకు బీసీసీఐ రోజుకు రూ.40,000 ఇస్తుంది. దీని ప్రకారం, యశస్వి దాదాపు రూ. 20 లక్షలు సంపాదించాడు. ఇది కాకుండా అతను లిస్ట్-A, టీ20 మ్యాచ్‌ల నుంచి కూడా సంపాదించాడు.
Yashasvi Jais-wow ?#IPL2023 #IPLonJioCinema #TATAIPL #MIvRR #IPL1000 | @ybj_19 @rajasthanroyals pic.twitter.com/L3l4GejSrZ
— JioCinema (@JioCinema) April 30, 2023
యశస్వి చెంత మెర్సిడెస్..
స్పోర్ట్స్‌కీడా నివేదిక ప్రకారం, యశస్వికి భదోహిలో విలాసవంతమైన ఇల్లు ఉంది. అతని వద్ద మెర్సిడెస్ కార్ ఉంది. యశస్వి ప్రస్తుతం ఆడుతున్న తీరు చూస్తూంటే అతను టీమ్ ఇండియాలోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వగలడని తెలుస్తోంది.