Anvay Dravid: తండ్రి తగ్గ తనయుడు అనిపించుకొంటున్న జూనియర్ వాల్ !

అన్వయ్ ద్రవిడ్ తన బ్యాటింగ్ నైపుణ్యాలతో రెండు కీలక అవార్డులు గెలుచుకున్నాడు. ప్రఖర్ చతుర్వేది కూచ్ బెహార్ ట్రోఫీ ఫైనల్లో చరిత్ర సృష్టించి యువరాజ్ రికార్డును అధిగమించాడు. కెఎస్‌సీఏ అవార్డుల కార్యక్రమంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు ప్రత్యేకంగా నిలిచారు. భారత క్రికెట్‌లో కొత్త తరం ఆటగాళ్ల ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Anvay Dravid: తండ్రి తగ్గ తనయుడు అనిపించుకొంటున్న జూనియర్ వాల్ !
Anvay Rahul Dravid
Follow us
Narsimha

|

Updated on: Dec 30, 2024 | 11:07 AM

భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ తన వారసుడు అన్వయ్ ద్రవిడ్ తన ప్రతిభతో సత్తా చాటుతూ రెండు కీలక అవార్డులను అందుకోవడం విశేషంగా నిలిచింది. విజయ్ మర్చంట్ ట్రోఫీ 2023-24లో అత్యధిక పరుగులు చేసిన అన్వయ్, వికెట్ కీపర్ బ్యాటర్‌గా తన ప్రత్యేకమైన ఆటను ప్రదర్శించాడు. అండర్-14 టోర్నమెంట్‌లో కూడా అత్యధిక పరుగులు చేసి, మరో అవార్డును కైవసం చేసుకున్నాడు. వికెట్ కీపర్-బ్యాటర్ అయిన అన్వయ్ అండర్-16 టోర్నమెంట్‌లో నాలుగు అర్ధసెంచరీలతో ఐదు మ్యాచ్‌ల్లో 45 సగటుతో 357 పరుగులు చేశాడు.

ఇక ప్రఖర్ చతుర్వేది తన అద్భుత బ్యాటింగ్‌తో కూచ్ బెహార్ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు చాంపియన్ టైటిల్ తెచ్చిపెట్టాడు. ముంబైపై ఫైనల్‌లో అజేయంగా 404 పరుగులతో క్వాడ్రపుల్ సెంచరీ సాధించి భారత క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును సృష్టించాడు. యువరాజ్ సింగ్ 24 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టడం చతుర్వేది అత్యున్నత ప్రతిభకు నిదర్శనం.