AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

R Praggnanandhaa: చదరంగంలో సంచలనం.. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా తమిళ కుర్రాడు

R Praggnanandhaa: డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరువానాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. క్లాసికల్ గేమ్‌ల తర్వాత ప్రజ్ఞానంద 3-9 తేడాతో తీవ్రంగా వె వెనుకబడిపోయాడు. టైటిల్ సాధించే అవకాశం లేదని అందరూ భావించిన సమయంలో తమిళనాడు కుర్రాడు ఊహించని రీతిలో పుంజుకున్నాడు.

R Praggnanandhaa: చదరంగంలో సంచలనం.. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా తమిళ కుర్రాడు
R Praggnanandhaa
Rakesh
|

Updated on: Aug 28, 2026 | 9:56 AM

Share

R Praggnanandhaa: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్‌ ప్రజ్ఞానంద అంతర్జాతీయ చెస్ రౌండ్లలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అమెరికాలోని సెంట్ లూయిస్‌లో జరిగిన ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. ఈ అరుదైన ట్రోఫీని కైవసం చేసుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ క్రీడాకారుడిగా నిలిచి రికార్డు పుస్తకాలకెక్కి నింగికెగిశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరువానాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. క్లాసికల్ గేమ్‌ల తర్వాత ప్రజ్ఞానంద 3-9 తేడాతో తీవ్రంగా వె వెనుకబడిపోయాడు. టైటిల్ సాధించే అవకాశం లేదని అందరూ భావించిన సమయంలో తమిళనాడు కుర్రాడు ఊహించని రీతిలో పుంజుకున్నాడు. వరుసగా రెండు రాపిడ్ గేమ్‌లు గెలుచుకుని స్కోరును 11-9తో తన వైపు తిప్పుకున్నాడు.

ఉత్కంఠభరిత పోరులో పట్టువదలని పోరాటం

ఆ తర్వాత జరిగిన బ్లిట్జ్ పోరులో కరువానా రెండో గేమ్‌ను గెలుచుకోవడంతో స్కోరు 12-12 వద్ద సమమైంది. అయినా సరే ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా ప్రజ్ఞానంద మూడో బ్లిట్జ్ గేమ్‌ను చేజిక్కించుకుని మళ్లీ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. చివరి గేమ్‌లో టైటిల్ కైవసం చేసుకోవడానికి కేవలం డ్రా మాత్రమే అవసరమవగా, చాకచక్యంగా త్రీ-ఫోల్డ్ రిపీటీషన్ పద్ధతి ద్వారా ఆ గేమ్‌ను డ్రాగా ముగించి విజేతగా నిలిచాడు.

విజయానికి కారణం అదేనని చెప్పిన యంగ్ స్టార్

మొత్తం ఆరు ఫైనల్ పోరుల్లో ప్రజ్ఞానంద మూడు గేమ్‌లలో విజయం సాధించగా, రెండింటిని డ్రా చేసుకుని ఒకే ఒక్క గేమ్‌లో ఓడిపోయాడు. ఆరు పాయింట్ల భారీ వ్యత్యాసాన్ని దాటుకుని విజయం సాధించడం సులభం కాదని మ్యాచ్ అనంతరం అతడు తెలిపాడు. గడిచిన ఏడాది కాలంలో రాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో తన ఆటతీరును ఎంతగానో మెరుగుపరుచుకున్నానని, అదే ఈ చారిత్రాత్మక విజయానికి ప్రధాన కారణమని సంతోషంగా పంచుకున్నాడు.

రూ.4 కోట్ల ప్రైజ్ మనీ కొల్లగొట్టిన యంగ్ సెన్సేషన్

ఈ విజయంతో ప్రజ్ఞానంద 2026 సంవత్సరంలో మరో మైలురాయిని చేరుకున్నాడు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలుచుకున్నందుకు విజేతగా అతనికి 2,00,000 డాలర్లు (సుమారు రూ.1.91 కోట్లు) ప్రైజ్ మనీ లభించింది. దీంతోపాటు 2027 గ్రాండ్ చెస్ టూర్‌కు నేరుగా అర్హత సాధించాడు. మొత్తం 2026 సర్క్యూట్ ద్వారా ఇప్పటివరకు ప్రజ్ఞానంద సంపాదించిన మొత్తం బహుమతి మొత్తం 404,354 డాలర్లకు (సుమారు రూ.4 కోట్లు) చేరింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us