Video: 6 ఫోర్లు, 6 సిక్సులు! ఓపెనర్ బ్యాటింగ్ కి ఎగిరి గంతేసిన ప్రీతీ పాప! వీడియో వైరల్!
ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన పంజాబ్ vs కోల్‌కతా మ్యాచ్ లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి అభిమానులను ఉత్సాహపరిచాడు. 49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 83 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రన్, 1000 పరుగులు పూర్తి చేసిన తొలి అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. ప్రీతి జింటా కూడా అతని సిక్సులకు ఉత్సాహంతో స్పందించింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయి రెండు జట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి.

ఐపీఎల్ 2025 సీజన్ క్రమంలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్ అభిమానులకు మరపురాని అనుభూతిని ఇచ్చింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని ప్రత్యర్థి మీద విరుచుకుపడింది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య-ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఆకట్టుకునే బ్యాటింగ్ ప్రదర్శించి అభిమానులను మంత్రముగ్ధులను చేశారు. ఈ ఇద్దరి చక్కటి భాగస్వామ్యం పంజాబ్ స్కోరు బోర్డుపై భారీ స్కోరు నిలిపింది. ముఖ్యంగా పటియాలాకు చెందిన ప్రభ్‌సిమ్రన్ సింగ్ తన బ్యాటింగ్ కళను చూపిస్తూ మైదానాన్ని హోరెత్తించాడు. 49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో అద్భుతమైన 83 పరుగులు చేసిన అతడు, సెంచరీ సాధించడానికి దగ్గరగా వచ్చి తప్పినప్పటికీ, అభిమానుల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు.
ప్రారంభంలో కొంచెం నెమ్మదిగా ఆడిన ప్రభ్‌సిమ్రన్, ఐదో ఓవర్ నుంచి తన అసలైన దూకుడును ప్రదర్శించాడు. ప్రతి బంతిని ధాటిగా ఆడుతూ, బౌండరీలు, సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడికి గురిచేశాడు. నరైన్ వేసిన ఓ బంతిని డీప్ ఎక్స్ ట్రా కవర్ మీదుగా 77 మీటర్ల భారీ సిక్స్ బాదినప్పుడు స్టేడియం నిండా హర్షధ్వానాలు మోగాయి. ఈ సిక్సును గమనించిన పంజాబ్ కింగ్స్ యజమానులు ప్రీతి జింటా ఆశ్చర్యానికి గురై నోరు తెరిచి కేరింతలు కొడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆమె ఆనందోత్సాహం చూస్తేనే ప్రభ్‌సిమ్రన్ ఇన్నింగ్స్ కు ఎంత విలువ ఉన్నదో అర్థమవుతుంది.
ఈ అద్భుత ప్రదర్శనతో ప్రభ్‌సిమ్రన్ సింగ్ పంజాబ్ కింగ్స్ తరఫున 1000 పరుగులు పూర్తి చేసిన తొలి అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా చరిత్రలో నిలిచాడు. ఇది అతని నైపుణ్యానికి, కష్టానికి నిలువెత్తు సాక్ష్యం. గత సీజన్లలో తక్కువ అవకాశాలతో పరిమితమైన ప్రభ్‌సిమ్రన్, ఈ సీజన్‌లో తన స్థానం పక్కాగా నిలబెట్టుకొని, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ తమ తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచే ఆశలు ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్ లాంటి యువతరంపై పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే, పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్ల అద్భుత ప్రదర్శనతో పాటు, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 25 నాటౌట్, ఇంగ్లిస్ 11 నాటౌట్ చేసి చివర్లో స్కోరును నిలబెట్టారు. మిగతా ఆటగాళ్లలో మ్యాక్స్‌వెల్ (7), మార్కో యాన్సన్ (3) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కోల్‌కతా బౌలింగ్ విభాగంలో వైభవ్ అరోరా రెండు వికెట్లు తీసి తక్కువ ప్రభావం చూపాడు. వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రస్సెల్ తలో వికెట్ సాధించారు. ఇక వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. చివరకు రెండు జట్లు చెరొక పాయింట్ పంచుకున్నారు.
Stylish and Audacious 😎
A brilliant 120-run opening partnership comes to an end 👏#PBKS 121/1 after 12 overs.
Updates ▶ https://t.co/oVAArAaDRX #TATAIPL | #KKRvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/o6U9uzFrNJ
— IndianPremierLeague (@IPL) April 26, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



