Asia Cup 2023: జైషాను పాకిస్థాన్‌కు ఆహ్వానించిన పీసీబీ.. ఎందుకో తెలుసా?

Asia Cup 2023, Jay Shah, India vs Pakistan: ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌ని చూసేందుకు తాను పాకిస్థాన్‌కు వెళ్లనని జైషా ముందుగానే స్పష్టం చేశారు. పాకిస్థాన్ నుంచి అధికారికంగా ఆహ్వానం అందిన తర్వాత జైషా తన వైఖరిని మార్చుకుని తొలి మ్యాచ్‌కు హాజరవుతాడో లేదో చూడాలి.

Asia Cup 2023: జైషాను పాకిస్థాన్‌కు ఆహ్వానించిన పీసీబీ.. ఎందుకో తెలుసా?
Jay Shah
Follow us
Venkata Chari

|

Updated on: Aug 19, 2023 | 9:59 AM

Jay Shah, India vs Pakistan: ఆగష్టు 30న ప్రారంభమయ్యే ఆసియా కప్ 2023 ప్రారంభ మ్యాచ్‌ని చూడాల్సిందిగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెక్రటరీ జైషాకు ఆహ్వానం పంపింది. ఆసియా కప్‌లో భాగంగా ముల్తాన్‌లో పాకిస్థాన్, నేపాల్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న జే షాకు పీసీబీ ఆహ్వానం పంపింది. షాతో పాటు, ఏసీసీలో భాగమైన ఇతర బోర్డు సభ్యులను కూడా ఆహ్వానించినట్లు పీసీబీ తెలిపింది.

అయితే ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌ని చూసేందుకు తాను పాకిస్థాన్‌కు వెళ్లనని జైషా ముందుగానే స్పష్టం చేశారు. పాకిస్థాన్ నుంచి అధికారికంగా ఆహ్వానం అందిన తర్వాత జైషా తన వైఖరిని మార్చుకుని తొలి మ్యాచ్‌కు హాజరవుతాడో లేదో చూడాలి.

ఆసియా కప్ ఆతిథ్యం విషయంలో గతంలోనూ అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ టోర్నీ కోసం తమ జట్టును పాకిస్థాన్‌కు పంపబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆసియా కప్‌ను పాకిస్థాన్ వెలుపల నిర్వహించాలని కూడా ప్రతిపాదించారు. ఈ కారణంగానే ఆసియా కప్‌లో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే పాకిస్థాన్‌లో జరగనుండగా, మిగిలిన మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

ఆహ్వానించిన అష్రఫ్..

ఊహించిన విధంగానే షాకు ఆహ్వానం పంపినట్లు వార్తా సంస్థ పీటీఐ తన నివేదికలో పేర్కొంది. షాకు పీసీబీ ఆహ్వానం పంపిందని, అయితే అతను పాకిస్తాన్‌కు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వర్గాలు తెలిపాయి. డర్బన్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో జైషా, పీసీబీ చైర్మన్ జాకా అష్రఫ్‌లు సమావేశమయ్యారు. తరువాత అష్రఫ్ షాను మౌఖికంగా ఆహ్వానించారు. అయితే ఇప్పుడు పీసీబీ అధికారిక ఆహ్వానాన్ని పంపిందని వర్గాలు తెలిపాయి.

పీసీబీ ఆహ్వానాన్ని షా అంగీకరించినట్లు పాక్ మీడియా గతంలో పేర్కొంది. అయితే దీనిని బీసీసీఐ కార్యదర్శి ఖండించారు. దీంతో పీసీబీ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు బాగా లేవు. దీంతో ఇరు దేశాల జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడం లేదు. క్రీడలు, రాజకీయాలు కలగకూడదన్న సందేశాన్ని పీసీబీ పంపాలనుకుంటున్నట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. భారత్‌తో క్రికెట్ సంబంధాలపై పాకిస్థాన్ వైఖరిని స్పష్టం చేయడమే దీని వెనుక ఉన్న ఆలోచన అని వర్గాలు తెలిపాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..