Virat Kohli: ప్రపంచకప్‌నకు ముందు విరాట్ కోహ్లీ చేతికి డైమండ్ బ్యాట్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Indian Cricket Team: ప్రస్తుతం విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. వెస్టిండీస్ పర్యటన తర్వాత, కోహ్లి ఇప్పుడు ఆగస్ట్ 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్‌లో ప్రత్యక్షంగా కనిపించనున్నాడు. వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా సన్నద్ధతను పరీక్షించే ఈ టోర్నీ కోహ్లికి, భారత్‌కు చాలా ముఖ్యమైనది. ఆసియా కప్-2023లో భారత్ తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడాల్సి ఉంది.
Virat Kohli: విరాట్ కోహ్లీ ప్రస్తుత కాలంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. విరాట్ కోహ్లిపై జనాల క్రేజ్ చాలా ఎక్కువ కాగా తాజాగా మరో ఉదాహరణ తెరపైకి వచ్చింది. సూరత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కోహ్లీకి బ్యాట్‌ను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇది సాధారణ బ్యాట్ కాదు లక్షల రూపాయల విలువ చేసే బ్యాట్. ఇండియా టుడే నివేదిక ప్రకారం, ఈ బ్యాట్ వజ్రాలతో చేసినట్లు తెలుస్తోంది. కోహ్లీకి డైమండ్ బ్యాట్ బహుమతిగా ఇవ్వాలని సూరత్ వ్యాపారవేత్త నిర్ణయించుకున్నాడు.
ఇవి కూడా చదవండిView this post on Instagram
కోహ్లీకి అందించే ఈ బ్యాట్ 1.04 క్యారెట్ ఒరిజినల్ డైమండ్‌గా ఉంటుందంట. ఈ బ్యాట్ 15 మీటర్ల పొడవు, ఐదు మీటర్ల వెడల్పు ఉంటుందని, దీని ఖరీదు రూ.10 లక్షలు అని చెబుతున్నారు. డైమండ్ టెక్నాలజీ నిపుణుడు, లెక్సస్ సాఫ్ట్‌మాక్ కంపెనీ డైరెక్టర్ ఉత్పల్ మిస్త్రీ ఈ బ్యాట్ తయారీని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
విరాట్ కోహ్లికి ఎన్నో రకాల బహుమతులు లభించాయి. అయితే ఈ బహుమతి అతనికి చాలా భిన్నంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కోహ్లీని బహుమతిగా ఇవ్వాలనుకునే వ్యక్తి కోహ్లికి వీరాభిమాని. కొన్నాళ్లుగా అతడిని ఫాలో అవుతున్నాడు.
ఆసియా కప్-ప్రపంచ కప్‌పై దృష్టి..
View this post on Instagram
ప్రస్తుతం విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. వెస్టిండీస్ పర్యటన తర్వాత, కోహ్లి ఇప్పుడు ఆగస్ట్ 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్‌లో ప్రత్యక్షంగా కనిపించనున్నాడు. వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా సన్నద్ధతను పరీక్షించే ఈ టోర్నీ కోహ్లికి, భారత్‌కు చాలా ముఖ్యమైనది. ఆసియా కప్-2023లో భారత్ తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 2న జరగనుంది. ఆ తర్వాత ప్రపంచకప్ ఉంది. అక్కడ కూడా కోహ్లి పరుగుల వర్షం కురిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు.
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..