Video: 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ.. రాజపక్సే తుఫాన్ ఇన్నింగ్స్‌.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్..

3 ఏళ్ల తర్వాత తొలిసారిగా మొహాలీలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా, తొలి మ్యాచ్‌లోనే పంజాబ్ బ్యాట్స్‌మెన్ భానుక రాజపక్సే తన జట్టు అభిమానులను అలరించాడు.

Video: 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ.. రాజపక్సే తుఫాన్ ఇన్నింగ్స్‌.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్..
pbks-vs-kkr-bhanuka-rajapaksa
Follow us
Venkata Chari

|

Updated on: Apr 01, 2023 | 5:30 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-16) రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కి పంజాబ్ కింగ్స్ (PBKS) 192 పరుగుల లక్ష్యాన్ని అందించింది. మొహాలీ మైదానంలో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది.

పంజాబ్ తరపున శ్రీలంక బ్యాట్స్‌మెన్ భానుక రాజపక్సే 32 బంతుల్లో 50 పరుగులు సాధించగా, కెప్టెన్ శిఖర్ ధావన్ 29 బంతుల్లో 40 పరుగులు చేశాడు. వీరిద్దరి మధ్య 55 బంతుల్లో 86 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. అంతకుముందు, ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 23 పరుగులతో జట్టుకు మెరుపు ఆరంభం అందించాడు.

ఇవి కూడా చదవండి

నరేన్‌ను చితక్కొట్టిన రాజపక్సే..

మూడో ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్సే.. మూడు-నాలుగు బంతులకు పిచ్‌ని, పరిస్థితులను పరీక్షించి ఆ తర్వాత దూకుడు పెంచాడు. మొదట KKR కీలక బౌలర్ అయిన సునీల్ నరైన్‌ను తన బలిపశువుగా చేసుకున్నాడు. ఐదో ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన నరేన్‌ వేసిన ఓవర్‌లో రాజపక్సే వరుసగా రెండు ఫోర్లు బాది, ఆ తర్వాత చివరి బంతికి లాంగ్ సిక్సర్ బాదాడు.

ఎనిమిదో ఓవర్‌లో నరేన్ మళ్లీ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఈసారి రాజపక్సే ఐదు బంతుల్లో ఫోర్లతో సహా 9 పరుగులు చేశాడు. ఈ విధంగా నరేన్‌పై రాజపక్సే 11 బంతుల్లో 23 పరుగులు చేశాడు.

మెరుపు ఇన్నింగ్స్‌తో హాఫ్ సెంచరీ..

రాజపక్సే నరేన్‌నే కాకుండా ఇతర కోల్‌కతా బౌలర్లను కూడా టార్గెట్ చేశాడు. ఈ విధంగా కేవలం 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే, అతను తన ఇన్నింగ్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. ఉమేష్ యాదవ్ బంతికి తన వికెట్ కోల్పోయాడు. ఈ క్రమంలో కేవలం 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!