Champions Trophy 2025: పాకిస్తాన్‌లో ఆడేందుకు టీమిండియా వెళ్లనుందా.. అనురాగ్ ఠాకూర్ ఏం చెప్పారంటే..?
IND vs PAK: పాకిస్తాన్‌లో టీమ్ ఇండియా ఆడుతుందా లేదా అనేది ప్రస్తుతం అందరిముందున్న ప్రశ్న. అయితే ఈ విషయంపై భారత క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఓ ప్రకటన చేశారు. అనురాగ్ ఠాకూర్ బుధవారం మాట్లాడుతూ..
2025 Champions Trophy: 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. నిన్న ఐసీసీ 2031 వరకు ఐసీసీ ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశాల లిస్టును విడుదల చేసింది. అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే.. పాకిస్తాన్‌లో టీమ్ ఇండియా ఆడుతుందా లేదా అనేది ప్రస్తుతం అందరిముందున్న ప్రశ్న. అయితే ఈ విషయంపై భారత క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఓ ప్రకటన చేశారు. అనురాగ్ ఠాకూర్ బుధవారం మాట్లాడుతూ, ‘సమయం వచ్చినప్పుడు ఏమి చేయాలో చూద్దాం. ఈ విషయంలో హోం మంత్రిత్వ శాఖ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంతర్జాతీయ టోర్నీలు ఉన్నప్పుడు, చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని తెలిపారు.
‘ఇటీవలి రోజుల్లో పాకిస్థాన్‌లో పరిస్థితులు బాగోలేనందున చాలా దేశాలు అక్కడి పర్యటన నుంచి వైదొలిగాయని అన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాం’ అని వెల్లడించారు.
29 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌కి పెద్ద అవకాశం.. దాదాపు 29 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, పాకిస్థాన్‌లో ICC టోర్నమెంట్ జరగనుంది. చివరిసారిగా 1996 వన్డే ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరిగాయి. దీని తర్వాత పాకిస్తాన్‌లో ఐసీసీ ఈవెంట్‌ను నిర్వహించలేదు.
2024 నుంచి 2031 వరకు ఐసీసీ ఈవెంట్లు.. 2024 టీ20 ప్రపంచ కప్: యూఎస్‌ఏ & వెస్టిండీస్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్తాన్ 2026 టీ20 ప్రపంచ కప్: భారతదేశం & శ్రీలంక 2027 వన్డే ప్రపంచ కప్: దక్షిణాఫ్రికా, జింబాబ్వే & నమీబియా 2028 టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా & న్యూజిలాండ్ 2029 టీ20 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రపంచ కప్: ఇంగ్లాండ్, ఐర్లాండ్ & స్కాట్లాండ్ 2031 వన్డే ప్రపంచ కప్: భారతదేశం & బంగ్లాదేశ్