- Telugu News Photo Gallery Cricket photos Icc rankings: pakistan skipper babar azam retain top spot davon conway and mohammad riwaz gets the jump
ICC T20 Ranking: టీమిండియాకు షాకిచ్చిన ఐసీసీ.. దిగజారిన కోహ్లీ, రాహుల్ ర్యాంకులు.. తొలిస్థానంలో ఎవరంటే?
టీ20 ప్రపంచకప్‌లో ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన ప్రభావం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో కనిపిస్తోంది.
Updated on: Nov 17, 2021 | 7:35 PM

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ తర్వాత తొలిసారిగా టీ20 ర్యాంకింగ్స్‌ను ఐసీసీ విడుదల చేసింది. టీ20 ప్రపంచకప్‌లో పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లకు ప్రతిఫలం లభించడంతో పాటు ర్యాంకింగ్స్‌లో ముందుకు దూసుకెళ్లారు. అయితే ఈ ఆటగాళ్లలో భారతీయులెవరూ లేకపోవడం గమనార్హం.

బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌లో టాప్-3 బ్యాట్స్‌మెన్‌లో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం 839 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలన్ రెండో స్థానంలో, ఐడాన్ మార్క్రామ్ మూడో స్థానంలో నిలిచారు.

న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వాయ్ ప్రస్తుతం మూడు స్థానాలు ఎగబాకి నాల్గవ స్థానంలో నిలిచాడు. ప్రపంచకప్‌లో కాన్వే తన జట్టు కోసం అద్భుతమైన ఆటను కనబరిచాడు. సెమీ ఫైనల్స్‌లో పాకిస్థాన్‌పై అతని ఇన్నింగ్స్‌తోనే న్యూజిలాండ్ విజయం సాధించింది.

పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఐదో స్థానంలో ఉన్నాడు. భారత బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ తర్వాత టాప్ 5లో నిలిచాడు. ప్రపంచకప్‌లో రిజ్వాన్ 6 మ్యాచ్‌ల్లో 70.25 సగటుతో 281 పరుగులు చేసి బిగ్ మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకున్నాడు.

ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ టీ20 ప్రపంచకప్‌లో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. దీని కారణంగా అతను నాల్గవ స్థానం నుండి ఏడో స్థానానికి పడిపోయాడు. విరాట్ కోహ్లీ 8వ స్థానంలో నిలిచాడు.





























