IND vs NZ: ప్రమాదంలో కోహ్లి రికార్డు.. గప్టిల్ దెబ్బకు మారనున్న లెక్కలు.. రోహిత్, చాహల్, రాహుల్ ఖాతాలో కూడా..!
India Vs New Zealand T20 Series: టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు టీమ్ ఇండియా, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. భారత జట్టు కొత్త కెప్టెన్, కోచ్‌తో అడుగుపెట్టనుంది. అయితే ఈ సిరీస్‌లో ఎలాంటి రికార్డులు ఏర్పడనున్నాయో తెలుసా?
India Vs New Zealand T20 Series: టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు టీమ్ ఇండియా, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. భారత జట్టు కొత్త కెప్టెన్, కోచ్‌తో అడుగుపెట్టనుంది. అయితే ఈ సిరీస్‌లో ఎలాంటి రికార్డులు ఏర్పడనున్నాయో తెలుసా? వాటిపై ఓ లుక్ వేద్దాం..
ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 81 పరుగులు చేస్తే విరాట్ కోహ్లి రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. దీంతో టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మారనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కోహ్లీ ఇప్పటివరకు 3,227 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో విరాట్ జట్టులో భాగం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో గప్టిల్‌కు చాలా మంచి అవకాశం ఉంది.
సిక్సర్ కింగ్‌గా రోహిత్ శర్మ.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో మూడు సిక్సర్లు బాదితే తన అంతర్జాతీయ క్రికెట్‌లో 450 సిక్సర్లు కొట్టేస్తాడు. ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా మారనున్నాడు. అతని కంటే ముందు షాహిద్ అఫ్రిది, క్రిస్ గేల్ ఈ ఘనత సాధించారు. రోహిత్ బ్యాట్ ఈ సిరీస్‌లో 10 సిక్సర్లు బాదితే, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 150 సిక్సర్లు బాదిన రికార్డు నెలకొల్పనున్నాడు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలవనున్నాడు. అతని కంటే ముందు, మార్టిన్ గప్టిల్ మాత్రమే పొట్టి ఫార్మాట్‌లో 150 సిక్సర్లు కొట్టాడు.
కేఎల్ రాహుల్ కూడా.. టీమ్ ఇండియా వైస్-కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌లో మొత్తం 249 పరుగులు సాధిస్తే.. అతను టీ20 లో 2,000 పరుగులు పూర్తిచేస్తాడు. రాహుల్ కంటే ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్ తరఫున 2,000 పరుగులు చేశారు.
అదే సమయంలో ఈ సిరీస్‌లో ఇషాన్ కిషన్ ఓ క్యాచ్ తీసుకుంటే అతని టీ20 క్రికెట్‌లో (దేశీయ, అంతర్జాతీయ) 50 క్యాచ్‌లు పూర్తవుతాయి.
చాహల్ ముందు ఓ రికార్డు.. యుజ్వేంద్ర చాహల్ టీ 20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియాలో చోటు సంపాదించలేకపోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో అతని పేరిట చాలా రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. కివీస్‌పై చాహల్ 4 వికెట్లు తీస్తే, టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చాహల్ నిలవనున్నాడు. అదే సమయంలో చాహల్ ఈ సిరీస్‌లో 8 వికెట్లు సాధిస్తే, టీ20 క్రికెట్ (దేశీయ, అంతర్జాతీయ)లో 250 వికెట్లు పూర్తి చేస్తాడు.
India Vs New Zealand: ఐపీఎల్ స్టార్లపై కన్నేసిన కెప్టెన్ రోహిత్.. డెబ్యూ క్యాప్ అందించే ఛాన్స్