IND vs NZ Highlights, 1st T20I: థ్రిల్లింగ్ విక్టరీ.. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్.. 1-0 ఆధిక్యంలోకి భారత్
IND vs NZ Highlights in Telugu: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీం 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 165 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
IND vs NZ Highlights in Telugu: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీం 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 165 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. కివీస్ టీంలో మార్టిన్ గప్టిల్ 70(42 బంతులు, 3 ఫోర్లు, 4 సిక్సులు), మార్స్ చాప్‌మన్ 63(50 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సులు) అర్థ శతకాలతో ఆకట్టుకున్నారు. దీంతో కివీస్ టీం పోరాడే స్కోర్‌ను సాధించింది. మిగతా బ్యాట్స్‌మెన్స్‌లో ఎవ్వరూ అంతగా రాణించలేదు. ఇక టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్, అశ్విన్ తలో రెండు వికెట్లు, చాహర్, సిరాజ్ చెకో వికెట్ పడగొట్టారు.
టీ20 ప్రపంచ కప్ 2021 ముగిసిన తర్వాత ప్రస్తుతం ద్వైపాక్షిక క్రికెట్ ప్రారంభమవుతుంది. ఈ రోజు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. మరికొద్ది సేపట్లో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్‌తో భారత జట్టులో కొత్త శకం కూడా మొదలవుతోంది. జట్టుకు కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్‌కి ఇది మొదటి మ్యాచ్. దీంతో పాటు టీ20 జట్టులో రెగ్యులర్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ తన తొలి సిరీస్‌లోకి కూడా అడుగుపెడుతున్నాడు.
భారత జట్టులో కొన్ని ప్రధాన మార్పులు చోటు చేసుకోనున్నాయి. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో సహా కొంతమంది కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
అదే సమయంలో, ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓడిపోయిన న్యూజిలాండ్ జట్టు.. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో సహా మరికొందరు ఆటగాళ్లు లేకుండానే ఈ సిరీస్‌లో ఆడనుంది.
LIVE Cricket Score & Updates
-
టీమిండియాదే విజయం..
తొలి టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో మరో రెండు బంతులు ఉండగానే భారత్ విజయం సాధించింది.
-
18 ఓవర్లకు భారత్ స్కోర్ 149/3
18 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్లు నష్టపోయి 149 పరుగులు సాధించింది. క్రీజులో పంత్ 12, శ్రేయాస్ అయ్యర్ 1 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
-
సూర్య కుమార్ యాదవ్ ఔట్..
సూర్య కుమార్ యాదవ్ (62 పరుగులు, 40 బంతులు, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) రూపంలో టీమిండియా మూడో వికెట్‌ను కోల్పోయింది. 144 పరుగుల వద్ధ బౌల్ట్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
-
15 ఓవర్లకు భారత్ స్కోర్ 127/2
15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు నష్టపోయి 127 పరుగులు సాధించింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్ 53, పంత్ 5 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
సూర్య కుమార్ హాఫ్ సెంచరీ
సూర్య కుమార్ యాదవ్ కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. 4 ఫోర్లు, 3 సిక్సులతో తన 50 పరుగులు పూర్త చేసుకున్నాడు.
-
-
రోహిత్ ఔట్..
రోహిత్ శర్మ (48 పరుగులు, 36 బంతులు, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రూపంలో టీమిండియా రెండో వికెట్‌ను కోల్పోయింది. 109 పరుగుల వద్ధ బౌల్ట్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
-
12 ఓవర్లకు భారత్ స్కోర్ 104/1
12 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోయి 104 పరుగులు సాధించింది. క్రీజులో రోహిత్ 46, సూర్యకుమార్ యాదవ్ 37 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆస్లే వేసిన 12 ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ ఒక సిక్స్, ఒక ఫోర్ తో సహా మొత్తం 15 పరుగులు రాబట్టారు.
-
9 ఓవర్లకు భారత్ స్కోర్ 79/1
9 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోయి 79 పరుగులు సాధించింది. క్రీజులో రోహిత్ 42, సూర్యకుమార్ యాదవ్ 18 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
ఏడు ఓవర్లకు స్కోర్..
7 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోయి 63 పరుగులు సాధించింది. క్రీజులో రోహిత్ 38, సూర్యకుమార్ యాదవ్ 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
రోహిత్-రాహుల్ చివరి నాలుగు ఇన్నింగ్స్ భాగస్వామ్యాలు
140 vs Afg 70 vs Sco 86 vs Nam 50 vs NZ
-
తొలి వికెట్ డౌన్..
కేఎల్ రాహుల్ (15 పరుగులు, 14 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) రూపంలో టీమిండియా తొలి వికెట్‌ను కోల్పోయింది. 50 పరుగుల వద్ధ శాంట్నర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
-
50పరుగుల భాగస్వామ్యం..
టీమిండియా ఓపెనర్ల జోరుతో న్యూజిలాండ్ బౌలర్లు తేలిపోయారు. వరుస బౌండరీలతో దుమ్ము దులిపారు. కేవలం 29 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసి పవర్ ప్లేలో జోరు కొనసాగించారు. రోహిత్ 31(17 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు), కేఎల్ రాహుల్ 15(13 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్)తో క్రీజులో ఉన్నారు.
-
మూడు ఓవర్లకు స్కోర్..
మూడు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 24 పరుగులు సాధించింది. క్రీజులో రోహిత్ 15, కేఎల్ రాహుల్ 7 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. సౌథీ వేసిన మూడవ ఓవర్లో మొత్తం 15 పరుగులు రాబట్టాడు. రోహిత్ ఈ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాదేశాడు.
-
టీమిండియా టార్గెట్ 165..
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీం 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. కివీస్ టీంలో మార్టిన్ గప్టిల్ 70(42 బంతులు, 3 ఫోర్లు, 4 సిక్సులు), మార్స్ చాప్‌మన్ 63(50 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సులు) అర్థ శతకాలతో ఆకట్టుకున్నారు. దీంతో కివీస్ టీం పోరాడే స్కోర్‌ను సాధించింది. మిగతా బ్యాట్స్‌మెన్స్‌లో ఎవ్వరూ అంతగా రాణించలేదు. ఇక టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్, అశ్విన్ తలో రెండు వికెట్లు, చాహర్, సిరాజ్ చెకో వికెట్ పడగొట్టారు.
-
ఐదో వికెట్ డౌన్
టిమ్ సీఫెర్ట్ (12) రూపంలో న్యూజిలాండ్ టీం ఐదో వికెట్ కోల్పోయింది. భువనేశ్వన్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
18 ఓవర్లకు కివీస్ స్కోర్..
18 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం నాలుగు వికెట్లు కోల్పోయి 152 పరుగులు సాధించింది. క్రీజులో రవీంద్ర 1, టిమ్ సీఫెర్ట్ 12 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
15 ఓవర్లకు కివీస్ స్కోర్..
15 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం మూడు వికెట్లు కోల్పోయి 123 పరుగులు సాధించింది. క్రీజులో గప్టిల్ 54, టిమ్ సీఫెర్ట్ 1 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
మూడో వికెట్ డౌన్
గ్లెన్ పిలిప్స్ (0) రూపంలో న్యూజిలాండ్ టీం మూడో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
-
రెండో వికెట్ డౌన్
చాప్‌మన్(63) రూపంలో న్యూజిలాండ్ టీం రెండో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
-
12 ఓవర్లకు కివీస్ స్కోర్..
12 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం ఒక వికెట్ కోల్పోయి 96 పరుగులు సాధించింది. క్రీజులో చాప్‌మన్ 56, గప్టిల్ 35 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
తొలి అర్థ శతకం సాధించిన చాప్‌మన్
న్యూజిలాండ్ టీం బ్యాట్స్‌మెన్ చాప్‌మన్ తన తొలి టీ20 అర్థ సెంచరీ సాధించాడు. 45 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో న్యూజిలాండ్ తరపున తన తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
-
తొమ్మిది ఓవర్లకు కివీస్ స్కోర్..
9 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం ఒక వికెట్ కోల్పోయి 62 పరుగులు సాధించింది. క్రీజులో చాప్‌మన్ 41, గప్టిల్ 18 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
ఆరు ఓవర్లకు కివీస్ స్కోర్..
6 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం ఒక వికెట్ కోల్పోయి 41 పరుగులు సాధించింది. క్రీజులో చాప్‌మన్ 30, గప్టిల్ 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
మూడు ఓవర్లకు కివీస్ స్కోర్..
మూడు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం ఒక వికెట్ కోల్పోయి 15 పరుగులు సాధించింది. క్రీజులో చాప్‌మన్ 13, గప్టిల్ 1 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
తొలి వికెట్ డౌన్
న్యూజిలాండ్ టీంకు తొలి ఓవర్‌లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మిచెల్(0) భువనేశ్వర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
-
మొదలైన న్యూజిలాండ్ బ్యాటింగ్
తొలి మ్యాచులో టాస్ ఓడిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఓపెనర్లుగా గప్టిల్, మిచెల్ బరిలోకి దిగారు.
-
IND vs NZ, 1st T20 LIVE: ఇరు జట్ల మధ్య రికార్డులు
ఇప్పటి వరకు ఇరుజట్ల మధ్య జరిగిన 17 మ్యాచులు జరిగాయి. ఇందులో న్యూజిలాండ్‌దే పైచేయిగా ఉంది. 9 మ్యాచుల్లో న్యూజిలాండ్ విజయం సాధించగా, 6 మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది.
-
వెంకటేష్ అయ్యర్ అరంగేట్రం
న్యూజిలాండ్ సిరీస్‌లో అనుకున్నట్లుగానే ఐపీఎల్ 2021లో ఆకట్టుకున్న వెంకటేష్ అయ్యర్ ప్లేయింగ్ XIలో చోటు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరూ దేశం కోసం ఆడాలని కోరుకుంటారు. కాబట్టి నాకు ఈ అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో ఆడడం ఆనందంగా ఉంది. ఒక క్రికెటర్‌గా ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. నాకు ఇచ్చిన పాత్రను సద్వినియోగం చేసుకుంటాను. నేను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. భారతీయ ప్రేక్షకుల ముందు ఆడటం చాలా అద్భుతంగా ఉంది’ అని తెలిపాడు.
The grin says it all! ?
A moment to cherish for @ivenkyiyer2512 as he makes his #TeamIndia debut. ? ?#INDvNZ @Paytm pic.twitter.com/2cZJWZBrXf
— BCCI (@BCCI) November 17, 2021
-
IND vs NZ, 1st T20 LIVE: టీమిండియా ప్లేయింగ్ XI
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(కీపర్), వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్
A look at #TeamIndia‘s Playing XI for the first T20I ?
Follow the match ▶️ https://t.co/5lDM57TI6f #INDvNZ @Paytm pic.twitter.com/VgcQG9B0mH
— BCCI (@BCCI) November 17, 2021
-
IND vs NZ, 1st T20 Live: న్యూజిలాండ్ ప్లేయింగ్ XI
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్(కీపర్), మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ(కెప్టెన్), టాడ్ ఆస్టిల్, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
-
టాస్ గెలిచిన టీమిండియా
తొలి టీ20 మ్యాచులో రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది.
Published On - Nov 17,2021 6:25 PM