Video: టీ20 ప్రపంచకప్‌లో చెత్త ప్రదర్శన.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్‌తో దడ పుట్టించిన పాక్ బౌలర్..

Colombo Strikers vs Kandy Falcons: లంక ప్రీమియర్ లీగ్‌లో కొలంబో స్ట్రైకర్స్ 51 పరుగుల భారీ తేడాతో క్యాండీ ఫాల్కన్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించిన కొలంబో విజయంలో షాదాబ్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. అతను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

Video: టీ20 ప్రపంచకప్‌లో చెత్త ప్రదర్శన.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్‌తో దడ పుట్టించిన పాక్ బౌలర్..
Shadab Khan Lpl 2024
Follow us

|

Updated on: Jul 03, 2024 | 11:13 AM

LPL 2024: పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచాడు. కానీ, అతని ఫామ్ లంక ప్రీమియర్ లీగ్ 2024లో తిరిగి అందిపుచ్చుకున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన ఈ లెగ్ స్పిన్నర్ మంగళవారం లంక ప్రీమియర్ లీగ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 20 పరుగులకే 4 వికెట్లు పడగొట్టాడు. క్యాండీ ఫాల్కన్స్‌పై షాదాబ్ ఖాన్ కూడా హ్యాట్రిక్ సాధించాడు. షాదాబ్ తన కెరీర్‌లో తొలిసారి హ్యాట్రిక్ సాధించిన ఘనత సాధించాడు. షాదాబ్ అద్భుత బౌలింగ్‌తో కొలంబో స్ట్రైకర్స్ 51 పరుగుల తేడాతో విజయం సాధించింది.

క్యాండీపై కొలంబో భారీ విజయం..

లంక ప్రీమియర్ లీగ్ మూడో మ్యాచ్‌లో కొలంబో స్ట్రైకర్స్ 20 ఓవర్లలో 198 పరుగుల భారీ స్కోరు చేసింది. వికెట్ కీపర్ సమవిక్రమ 48 పరుగులు, తిసర పెరీరా 38 పరుగులు, మహ్మద్ వసీమ్ 32 పరుగులు, కరుణరత్నే 10 బంతుల్లో 25 పరుగులు చేశారు. జవాబుగా, క్యాండీ జట్టు 15.5 ఓవర్ల పాటు మాత్రమే మైదానంలో ఉండి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్యాండీ తరపున దినేష్ చండిమాల్ మాత్రమే 38 పరుగులు, ఫ్లెచర్ 24, హసరంగా 25, ఏంజెలో మాథ్యూస్ 25 పరుగులతో రాణించగా, షాదాబ్ స్పిన్ జట్టును లక్ష్యానికి దూరం చేసింది.

షాదాబ్ హ్యాట్రిక్..

షాదాబ్ ఖాన్ తన చివరి ఓవర్లో హ్యాట్రిక్ సాధించిన ఘనత సాధించాడు. అతను 15వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చినప్పుడు నాల్గో బంతికి ప్రత్యర్థి కెప్టెన్ హసరంగాను మహ్మద్ వసీమ్ క్యాచ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అఘా సల్మాన్ తొలి బంతికే షాదాబ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన పవన్ రత్తన్ననాయక్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి షాదాబ్ హ్యాట్రిక్ సాధించాడు. కేవలం 12 బంతుల్లోనే క్యాండీ జట్టు తన చివరి 6 వికెట్లను కోల్పోయిన విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీంతో ఆ జట్టు 51 పరుగుల భారీ ఓటమిని చవిచూసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. ఎందుకో తెలుసా.?
అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. ఎందుకో తెలుసా.?