Babar Azam vs Virat Kohli: ఒకరేమో చంద్రుడు.. మరొకరేమో సూర్యుడు.. విరాట్-బాబర్‌ల పోలికపై పాక్ కోచ్ కీలక వ్యాఖ్యలు..!

PAK vs AUS: పాక్ కెప్టెన్ బాబర్ ఆజం, భారత స్టార్ విరాట్ కోహ్లీ పోలికపై పాకిస్థాన్ బ్యాటింగ్ కన్సల్టెంట్ మాథ్యూ హేడెన్ తొలిసారిగా ప్రకటన ఇచ్చాడు.

Babar Azam vs Virat Kohli: ఒకరేమో చంద్రుడు.. మరొకరేమో సూర్యుడు.. విరాట్-బాబర్‌ల పోలికపై పాక్ కోచ్ కీలక వ్యాఖ్యలు..!
Babar Azam Vs Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Nov 11, 2021 | 7:17 AM

Babar Azam vs Virat Kohli: టీ20 ప్రపంచకప్‌లో అద్భుతమైన ఆటతీరుతో పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగే రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ ముఖ్యమైన మ్యాచ్‌కు ముందు, జట్టు కోచ్ మాథ్యూ హేడెన్ జట్టు సన్నద్ధత గురించి మాట్లాడారు. ఈ సమయంలో, అతను భారత స్టార్ విరాట్ కోహ్లీ వర్సెస్ పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌లను నిరంతరం పోల్చడంపై కూడా ఒక ప్రకటన చేశాడు.

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021లో భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం టోర్నీలో తమ జట్టు మంచి ప్రదర్శనకు పునాది వేసిందని పాకిస్థాన్ బ్యాటింగ్ కన్సల్టెంట్ హేడెన్ అభిప్రాయపడ్డాడు. టోర్నీలో ఇప్పటివరకు పాకిస్థాన్ ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోకపోవడానికి ఆటగాళ్లకు శిక్షణ, ఆధ్యాత్మికత పట్ల ఉన్న నిబద్ధతే కారణమని తెలిపాడు. గ్రూప్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ పాకిస్థాన్ గెలిచి టైటిల్ కోసం బలమైన పోటీదారులుగా నిలిచింది.

భారత్‌పై విజయం ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసాన్నిప పెంచింది.. మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో హేడెన్ మాట్లాడుతూ, ‘ఈ టోర్నమెంట్‌లో భారత్‌తో దుబాయ్‌లో ఆడిన మొదటి మ్యాచ్ అత్యంత ప్రత్యేకమైనది. దీన్ని యాషెస్ సిరీస్‌తో మాత్రమే పోల్చవచ్చు. ఇంత పెద్ద మ్యాచ్‌ను ఆడటం పట్ల పాక్ ఆటగాళ్ల వైఖరి, విశ్వాసం అద్భుతమైనది. ఆ మ్యాచ్ నాలుగు వారాల పటిష్టమైన పనికి, శిక్షణ పట్ల నిబద్ధతకు పునాది వేసిందని నేను భావిస్తున్నాను. ఇస్లాంతో హృదయపూర్వక సంబంధం ఉంది. పాకిస్తాన్ జట్టులోని అందరినీ మార్గనిర్దేశం చేయడంలో, ఏకం చేయడంలో ఆధ్యాత్మికత కీలక పాత్ర పోషించింది.

విరాట్ వర్సెస్ బాబర్.. విరాట్‌ కోహ్లి, బాబర్‌ అజామ్‌లను చాలా కాలంగా పోల్చుతున్నారు. పాకిస్థాన్ కోచ్‌ మాట్లాడుతూ, ‘బాబర్, అతని వ్యక్తిత్వం రెండూ వేర్వేరు. బాబర్ వ్యక్తిత్వం కోహ్లీకి పూర్తిగా వ్యతిరేకం. అలాగే చాలా విరుద్ధంగా ఉంటుంది. విరాట్ కోహ్లీ మైదానంలో చాలా ఉద్వేగభరితంగా కనిపిస్తాడు’ అని ఆయన పేర్కొన్నాడు.

వ్యూహాత్మకంగా, ఆస్ట్రేలియా ప్రధాన కోచ్‌గా ఉన్న తన మాజీ సహచర ఓపెనింగ్ భాగస్వామి జస్టిన్ లాంగర్ నుంచి హేడెన్ గురువారం సవాలును ఎదుర్కొంటాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు, క్రికెట్ సంస్కృతిపై తనకున్న అవగాహన వల్ల పాకిస్థాన్ లాభపడుతుందని హేడెన్ అభిప్రాయపడ్డాడు. నేను రెండు దశాబ్దాలకు పైగా ఆస్ట్రేలియన్ క్రికెట్‌లో ఫైటర్‌గా ఉన్నాను. కాబట్టి ఇది నాకు ఈ ఆటగాళ్లే కాకుండా ఆస్ట్రేలియాలోని క్రికెట్ సంస్కృతి గురించి కూడా మంచి అవగాహన కలిగిస్తుంది. కచ్చితంగా ఆస్ట్రేలియాను ఓడిస్తామని తెలిపాడు.

Also Read: వాయిదా పడిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్.. అలాంటి రిస్క్ తీసుకోలేమంటోన్న టర్కీ ప్రభుత్వం..!

ENG vs NZ Match Result: ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై విజయం సాధించిన న్యూజిలాండ్..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..