IND vs NZ: ఆ ప్లేయర్ చేసిన తప్పేంటి.. కివీస్ సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదు.. విరాట్ చేసిన తప్పే మీరూ చేస్తున్నారా?: సునీల్ గవాస్కర్

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో రాహుల్ చాహర్‌కు అవకాశం లభించకపోవడంతో దక్షిణాఫ్రికా-ఏ పర్యటనకు పంపనున్న సంగతి తెలిసిందే.

IND vs NZ: ఆ ప్లేయర్ చేసిన తప్పేంటి.. కివీస్ సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదు.. విరాట్ చేసిన తప్పే మీరూ చేస్తున్నారా?:  సునీల్ గవాస్కర్
Sunil Gavaskar
Follow us
Venkata Chari

|

Updated on: Nov 11, 2021 | 7:15 AM

India Vs New Zealand: న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీం ఇండియాను ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే వెంటనే, చాలా మంది క్రికెట్ నిపుణులు ఆ జట్టును చూసి చాలా సంతోషించారు. ఐపీఎల్ 2021లో అద్భుత ప్రదర్శన చేసిన యువ ఆటగాళ్లకు జట్టులో అవకాశం లభించింది. వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్ తొలిసారిగా న్యూజిలాండ్ టీ20 సిరీస్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. టీ20 ప్రపంచ కప్ కోసం సెలెక్టర్లు ఎంపిక చేసిన ఈ జట్టు నుంచి ఓ పేరు తప్పిపోయినప్పటికీ, ఆ టోర్నమెంట్‌లో కేవలం ఒక మ్యాచ్ ఆడిన తర్వాత టీంతోపాటు బయటకు వచ్చేశాడు.

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు జట్టులో చోటు దక్కించుకోని లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ గురించి చర్చ ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. అతని స్థానంలో యుజ్వేంద్ర చాహల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. చాహల్ పునరాగమనం ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే టీమ్ మేనేజ్‌మెంట్ రాహుల్ చాహర్‌పై ఇంతకుముందు విశ్వాసం ఉంచింది. అయితే అతనికి ఎక్కువ అవకాశంకూడా రాలేదు. ప్రస్తుతం కివీస్ సిరీస్‌ నుంచి తొలగించారు. ఈ లెగ్ స్పిన్నర్ భారతదేశం ఏ టీంతో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్నాడు. రాహుల్ చాహర్‌ను తొలగించడంపై మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ ప్రశ్నలు సంధించారు.

రాహుల్ చాహర్ చేసిన తప్పేంటి? స్పోర్ట్స్ టుడేతో మాట్లాడిన సునీల్ గవాస్కర్, రాహుల్ చాహర్‌ను న్యూజిలాండ్ సిరీస్‌ నుంచి తప్పించడానికి గల కారణం తెలుసుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, ‘టీమ్ ఇండియాకు దూరంగా ఉండేందుకు రాహుల్ చాహర్ అంతలా ఏ తప్పు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో 15 మంది ఆటగాళ్లలో చాహర్‌కు చోటు దక్కింది. ఒకే ఒక్క మ్యాచ్‌లో అవకాశం దక్కించుకుని ప్రస్తుతం జట్టుకు దూరమయ్యాడు. రాహుల్ చాహర్ తన తప్పు ఏమిటని ఆలోచిస్తు ఉండోచ్చు. జట్టు నుంచి ఎందుకు బయటికి పంపారో’ సెలక్షన్ కమిటీ నుంచి ఎవరైనా చాహర్‌కి చెబుతారా అని ఆయన ప్రశ్నించారు.

రాహుల్ చాహర్‌తో పాటు హార్దిక్ పాండ్యా కూడా న్యూజిలాండ్ సిరీస్‌లో టీమిండియాలో చోటు దక్కించుకోలేదు. హార్దిక్ పాండ్యా స్థానంలో వెంకటేష్ అయ్యర్‌ని ఎంపిక చేశారు. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌కు ఫిట్‌గా లేడని అందుకే అతడిని జట్టు నుంచి తప్పించారు.

భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రీతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ కుమార్, భువనేశ్వర్ ఖాన్ , దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.

Also Read: Babar Azam vs Virat Kohli: ఒకరేమో ప్రశాంతం.. మరొకరేమో ఉద్వేగభరితం.. విరాట్-బాబర్‌ల పోలికపై పాక్ కోచ్ కీలక వ్యాఖ్యలు..!

వాయిదా పడిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్.. అలాంటి రిస్క్ తీసుకోలేమంటోన్న టర్కీ ప్రభుత్వం..!