Rohith Sharma: వన్డే, టీ20లకు రోహిత్ శర్మను కెప్టెన్ చేయడం మంచి నిర్ణయం.. పాక్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఓపెనర్ రోహిత్ శర్మ టీమ్ ఇండియా వైట్ బాల్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కానీ అతను గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరంగా ఉన్నాడు...

Rohith Sharma: వన్డే, టీ20లకు రోహిత్ శర్మను కెప్టెన్ చేయడం మంచి నిర్ణయం.. పాక్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Rohith
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jan 30, 2022 | 4:48 PM

ఓపెనర్ రోహిత్ శర్మ టీమ్ ఇండియా వైట్ బాల్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కానీ అతను గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో ఆడనున్నాడు. రోహిత్ టెస్ట్ కెప్టెన్సీ రేసులో కూడా ఉన్నాడు. వన్డే, టీ20 జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ(Rohith Sharma)ను నియమించడం మంచి నిర్ణయమని పాక్ లెజెండరీ ఓపెనర్, మాజీ కెప్టెన్ అమీర్ సొహైల్(aamer sohail) అన్నాడు. టీమ్ ఇండియాకు ఎంపిక అవ్వాలంటే దేశవాళీ క్రికెట్‌ ప్రదర్శన ఆధారంగా తీసుకోవాలని, ఐపీఎల్(ipl) ప్రదర్శన ఆధారంగా కాదని అమీర్ సోహైల్ ఉద్ఘాటించాడు.

“టీమ్ ఇండియా కెప్టెన్‌గా రోహిత్ గొప్ప ఎంపిక. కెప్టెన్సీ అతని బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతుందని నేను అనుకోను. అతనికి IPL కెప్టెన్సీ అనుభవం ఉంది. కొత్త ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మంచి వేదికగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అభివర్ణించాడు. అయితే దానిని టీమ్ ఇండియాలో ఎంపికకు కొలమానంగా తీసుకోవద్దు” అని చెప్పాడు. ఇండో-పాక్ మ్యాచ్‌లు ఆడకపోవడంపై కూడా మాట్లాడాడు. చిరకాల ప్రత్యర్థి దేశాలు రెండూ 2012 సంవత్సరం తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడలేదు. కేవలం ఐసీసీ టోర్నిల్లో మాత్రమే ఇరు దేశాలు తలపడుతున్నాయని అమీర్ సోహైల్ అన్నాడు. “క్రికెట్‌లో రాజకీయాలు తీసుకురావద్దని ఐసీసీ నిరంతరం చెబుతోంది. క్రికెట్ కోణంలో నేను కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నాను. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగే క్రికెట్‌ యుద్ధాన్ని ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ చూడాలనుకుంటున్నారు.” అని అన్నాడు.

2022 టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ 23న జరగనున్న ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. గతేడాది దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ చివరిసారిగా తలపడగా, అందులో పాకిస్థాన్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Read Also… Virat Kohli: విరాట్ కోహ్లీ అసాధారణ కెప్టెన్.. జో రూట్ మాత్రం అలా కాదు.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడి వ్యాఖ్యలు..

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?