AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL-2022: మహారాష్ట్రలో లీగ్ మ్యాచ్‌లు.. అహ్మదాబాద్‌లో ప్లేఆఫ్ మ్యాచ్‌లు..

క్రికెట్ అభిమానులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 (IPL 2022) సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్‌లో రెండు కొత్త ఫ్రాంచైజీలు చేరడంతో మొత్తం జట్ల సంఖ్య 10కి చేరింది...

IPL-2022: మహారాష్ట్రలో లీగ్ మ్యాచ్‌లు.. అహ్మదాబాద్‌లో ప్లేఆఫ్ మ్యాచ్‌లు..
Ipl 2022
Srinivas Chekkilla
|

Updated on: Jan 30, 2022 | 5:48 PM

Share

క్రికెట్ అభిమానులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 (IPL 2022) సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్‌లో రెండు కొత్త ఫ్రాంచైజీలు చేరడంతో మొత్తం జట్ల సంఖ్య 10కి చేరింది. కానీ ఐపీఎల్‌కు కరోనా పెద్ద అడ్డంకిగా మారింది. అయినా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) టోర్నమెంట్‌ను ఇండియాలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ముంబై(Mumbai)నే వేదికగా బోర్డు నిర్ణయించినప్పటికీ తుది నిర్ణయం మాత్రం ఇంకా తీసుకోలేదు. ఓ నివేదిక ప్రకారం IPL 15 లీగ్ దశ మ్యాచ్‌లు మహారాష్ట్రలో ప్లేఆఫ్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిసింది.

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం జనవరి 27 గురువారం బోర్డు సమావేశం జరిగింది. దీనిలో మ్యాచ్‌లు నిర్వహించే వేదికలపై చర్చించారు. కరోనా వైరస్ దృష్ట్యా, వివిధ రాష్ట్రాల్లో లీగ్ ప్లేఆఫ్ మ్యాచ్‌లను నిర్వహించాలని బోర్డు పరిశీలిస్తోందని నివేదిక పేర్కొంది. కరోనా పెరిగితే టోర్నీని యూఏఈకి తరలించాలని నిర్ణయించారు. మహారాష్ట్రలోని 4 స్టేడియాల్లో మ్యాచ్‌లు

నివేదిక ప్రకారం, మహారాష్ట్రలోని ముంబైతో పాటు పుణెలో కూడా లీగ్ దశలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ విధంగా, ఈ మ్యాచ్‌లను మహారాష్ట్రలోని 4 స్టేడియాల్లో నిర్వహించనున్నారు. ఇందుకోసం ముంబైలోని వాంఖడే స్టేడియం, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు చెందిన చారిత్రక బ్రబౌర్న్ స్టేడియం, నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం సిద్ధమయ్యాయి. అదే సమయంలో పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మైదానంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. అదే సమయంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ప్లేఆఫ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.

కేసులు తగ్గితే మహారాష్ట్రలో జరిగే మ్యాచ్‌లకు 25 శాతం ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామని కూడా నివేదికలో పేర్కొన్నారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అంతకుముందు జనవరి 22న బోర్డు, ఫ్రాంచైజీ యజమానుల సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాత, బోర్డు సెక్రటరీ జే షా మాట్లాడుతూ, అన్ని ఫ్రాంచైజీలు టోర్నమెంట్‌ను భారతదేశంలో నిర్వహించాలని కోరుకుంటున్నాయని. దాని కోసం బీసీసీఐ అన్ని ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. 15వ సీజన్ మార్చి చివరి వారంలో ప్రారంభమవుతుందని, మే నెల వరకు కొనసాగుతుందని షా చెప్పారు.

Read  Also… Rohith Sharma: వన్డే, టీ20లకు రోహిత్ శర్మను కెప్టెన్ చేయడం మంచి నిర్ణయం.. పాక్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..