Champions Trophy 2025: ఛాంపియన్ ట్రోఫీ కోసం రూ. 1300 కోట్లు.. భారత్ రాకపై బెంగపెట్టుకున్న పాకిస్తాన్?
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా సన్నాహాలు చేస్తోంది. బోర్డు తన క్రికెట్ మైదానాలన్నింటినీ పూర్తిగా మార్చాలని నిర్ణయించుకుంది. ఇందులో కరాచీ, లాహోర్, రావల్పిండి ఉన్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఈ స్టేడియాలను మార్చనున్నారు.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా సన్నాహాలు చేస్తోంది. బోర్డు తన క్రికెట్ మైదానాలన్నింటినీ పూర్తిగా మార్చాలని నిర్ణయించుకుంది. ఇందులో కరాచీ, లాహోర్, రావల్పిండి ఉన్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఈ స్టేడియాలను మార్చనున్నారు. ఇటువంటి పరిస్థితిలో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇందుకోసం రూ.1700 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. లాహోర్‌లో జరిగిన పీసీబీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్టేడియంలను పూర్తిగా మార్చనున్న పీసీబీ..
ఈ స్టేడియాలను పూర్తిగా పునరుద్ధరించడమే కాకుండా దేశంలో మహిళా క్రికెట్ కోసం బోర్డు రూ.24 కోట్లు కేటాయించింది. బోర్డు ఇప్పుడు మహిళా క్రికెట్‌పై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇది కాకుండా మహిళా క్రీడాకారుల మ్యాచ్‌లకు మద్దతుగా రూ.17 కోట్లు కేటాయించారు.
ఈ సమావేశంలో, ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా పాకిస్థాన్‌లో నిర్వహించనున్నట్లు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌కు తెలియజేశారు. ఇది కాకుండా, టోర్నమెంట్ మిగిలిన అంశాలను ఐసీసీ వార్షిక బోర్డు సమావేశంలో చర్చిస్తానని చెప్పుకొచ్చాడు. ఈ నెలాఖరులో కొలంబోలో ఈ సమావేశం జరగనుంది.
2024-25 సీజన్ బడ్జెట్‌పై చర్చించే ఈ సమావేశాన్ని పీసీబీ నిర్వహించనుంది. బంగ్లాదేశ్, ఇంగ్లండ్, వెస్టిండీస్‌తో జరగనున్న సిరీస్‌ల అజెండా ఇందులో ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే టూర్‌పై కూడా చర్చలు జరగనున్నాయి.
స్టేడియం పనులు ప్రారంభమయ్యాయని నఖ్వీ బోర్డు ఆఫ్ గవర్నర్లకు తెలిపారు. ఈ స్టేడియాలను ఏ క్లాస్ స్టేడియాలుగా మార్చడమే మా లక్ష్యమని తెలిపారు. ఈ మూడు స్టేడియాల్లో పనుల కోసం పాలక మండలి రూ.1300 కోట్ల నిధులను కేటాయించింది. ఇది కాకుండా దేశీయ సీజన్‌కు రూ.450 కోట్లు చేర్చారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..