AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI World Cup: పాత ఫార్మాట్‌తో సిద్ధమైన 2027 వన్డే వరల్డ్ కప్.. టీమిండియా ఫైనల్ చేరడం పక్కా.. ఎందుకంటే?

World Cup 2027 Format: వన్డే వరల్డ్ కప్‌ 2027పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఈసారి టోర్నమెంట్ పాత ఫార్మాట్‌తో తిరిగి రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా మరోసారి ఫైనల్ చేరుతుందా అన్న చర్చ మొదలైంది.

ODI World Cup: పాత ఫార్మాట్‌తో సిద్ధమైన 2027 వన్డే వరల్డ్ కప్.. టీమిండియా ఫైనల్ చేరడం పక్కా.. ఎందుకంటే?
Team India
Venkata Chari
|

Updated on: Mar 23, 2026 | 1:05 PM

Share

World Cup 2027 Format: 2027 వన్డే వరల్డ్ కప్‌ను దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా కలిసి నిర్వహించనున్నాయి. ఇది 2003 తర్వాత ఈ దేశాల్లో జరుగుతున్న మరో వరల్డ్ కప్ కావడం విశేషం. అప్పట్లో కెన్యా కూడా హోస్ట్‌గా ఉండగా, ఈసారి నమీబియా మూడో దేశంగా ఎంపికైంది.

పాత ఫార్మాట్‌కు మళ్లీ స్వాగతం..

ఈసారి వరల్డ్ కప్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపులో 7 జట్లు ఉండి, ఒక్కో జట్టు మిగతా జట్లతో మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 3 జట్లు సూపర్-6 దశకు చేరతాయి. ఈ దశలో ఒక గ్రూప్ జట్లు మరో గ్రూప్ జట్లతో తలపడతాయి. ఈ ఫార్మాట్ 2003 వరల్డ్ కప్‌ను గుర్తు చేస్తోంది.

‘పాయింట్స్ క్యారీ ఫార్వర్డ్’ ప్రత్యేకత..

సూపర్-6 దశలో కీలక అంశం ‘పాయింట్స్ క్యారీ ఫార్వర్డ్’. అంటే గ్రూప్ దశలో గెలిచిన మ్యాచ్‌ల పాయింట్లు సూపర్-6లో కూడా లెక్కలోకి వస్తాయి. దీంతో ప్రతి మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యం పెరుగుతుంది. ఈ దశలో టాప్‌లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరతాయి. చివరగా రెండు జట్లు ఫైనల్‌లో తలపడతాయి.

టీమిండియాకు మంచి అవకాశమా?

2003 వరల్డ్ కప్ కూడా ఇదే ఫార్మాట్‌లో జరిగింది. ఆ టోర్నమెంట్‌లో టీమిండియా ఫైనల్ వరకు చేరింది. అయితే ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. ఈసారి కూడా అదే ఫార్మాట్, అదే దేశాలు కావడంతో టీమిండియా ఫైనల్ చేరుతుందన్న ఆశలు అభిమానుల్లో పెరుగుతున్నాయి. గత టీ20 విజయాలతో జట్టు ఫామ్‌లో ఉండటం కూడా ప్లస్ పాయింట్.

2027 వన్డే వరల్డ్ కప్ పాత ఫార్మాట్‌తో తిరిగి రావడం క్రికెట్ అభిమానులకు సంతోషం కలిగిస్తోంది. టీమ్ ఇండియా ఈసారి ఫైనల్ చేరి, ట్రోఫీ గెలుస్తుందా లేదా అన్నది చూడాలి. 2003 కథ మళ్లీ రిపీట్ అవుతుందా లేదా చరిత్ర మారుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us