AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: లైవ్ మ్యాచ్‌లో ‘పుష్ప’లా మారిన డేవిడ్ వార్నర్.. అదిరిపోయే స్టెప్పులు.. వైరల్ వీడియో..

AUS vs NZ: బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, వార్నర్ పుష్ప చిత్రంలోని పాటపై అద్భుతమైన కదలికలు చేసినట్లు వైరల్ వీడియోలో చూడవచ్చు. వార్నర్ డ్యాన్స్ చూసి స్టాండ్స్‌లో కూర్చున్న వారు ఆనందంతో కేకలు వేయడం ప్రారంభించారు. పుష్ప సినిమాలోని పాటపై వార్నర్ డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు చేశాడు. వార్నర్ ఇప్పటివరకు టోర్నీలో మంచి ఫామ్‌లో కనిపించాడు. అతని బ్యాట్‌ నుంచి రెండు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీ వచ్చాయి.

Watch Video: లైవ్ మ్యాచ్‌లో 'పుష్ప'లా మారిన డేవిడ్ వార్నర్.. అదిరిపోయే స్టెప్పులు.. వైరల్ వీడియో..
David Warner Pushpa Dance V
Venkata Chari
|

Updated on: Oct 28, 2023 | 9:03 PM

Share

David Warner’s Pushpa Dance: లైవ్ మ్యాచ్‌లోనే డేవిడ్ వార్నర్ పుష్ప స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ODI ప్రపంచ కప్ 2023లో భాగంగా 27వ మ్యాచ్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 383 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, ఆస్ట్రేలియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో డేవిడ్ వార్నర్.. పుష్ప లాగా డ్యాన్స్ చేయడం ద్వారా ధర్మశాలలో సందడి చేశాడు. వార్నర్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, వార్నర్ పుష్ప చిత్రంలోని పాటపై అద్భుతమైన కదలికలు చేసినట్లు వైరల్ వీడియోలో చూడవచ్చు. వార్నర్ డ్యాన్స్ చూసి స్టాండ్స్‌లో కూర్చున్న వారు ఆనందంతో కేకలు వేయడం ప్రారంభించారు. పుష్ప సినిమాలోని పాటపై వార్నర్ డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు చేశాడు.

ఇవి కూడా చదవండి

ప్రపంచకప్‌లో డేవిడ్ వార్నర్ అద్భుతమైన ఫామ్‌..

వార్నర్ ఇప్పటివరకు టోర్నీలో మంచి ఫామ్‌లో కనిపించాడు. అతని బ్యాట్‌ నుంచి రెండు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీ వచ్చాయి. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాడు. వార్నర్ 65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేశాడు. అంతకుముందు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగులు, పాకిస్థాన్‌పై 163 పరుగులు చేశాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోర్..

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. జట్టు తరపున, ఓపెనర్ ట్రావిస్ హెడ్ 10 ఫోర్లు, 7 సిక్సర్లతో సహా 162.69 స్ట్రైక్ రేట్‌తో 109 పరుగులు (67 బంతుల్లో) ఇన్నింగ్స్ ఆడాడు. ఇది కాకుండా వార్నర్ 81 పరుగులు చేశాడు. హెడ్‌, వార్నర్‌లు తొలి వికెట్‌కు 117 బంతుల్లో 175 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత ఛేజింగ్ న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 383 పరుగులు మాత్రమే చేయగలిగింది.

న్యూజిలాండ్ ప్లేయింగ్‌-XI :

డెవాన్‌ కాన్వే, విల్‌ యంగ్‌, రచిన్‌ రవీంద్ర, డేరిల్‌ మిచెల్‌, టామ్‌ లేథమ్‌ (కెప్టెన్‌ అండ్‌ వికెట్‌ కీపర్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌, జేమ్స్‌ నీషమ్‌, మిచెల్‌ శాంట్నర్‌, మ్యాట్‌ హెన్రీ, లూకీ ఫెర్గుసన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌.

ఆస్ట్రేలియా ప్లేయింగ్‌-XI :

డేవిడ్‌ వార్నర్‌, ట్రావిస్‌ హెడ్‌, మిచెల్‌ మార్ష్‌, స్టీవ్ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, జోష్‌ ఇంగ్లిస్‌ (వికెట్‌ కీపర్‌), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ప్యాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), మిచెల్‌ స్టార్క్‌, ఆడమ్‌ జంపా, జోష్‌ హేజిల్‌వుడ్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..