AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: పుట్టినరోజున స్పెషల్ కేక్ కట్ చేయనున్న కింగ్ కోహ్లీ.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

Virat Kohli Birthday: 2023 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 5 మ్యాచ్‌ల్లో 354 పరుగులు చేశాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లి సగటు 118గా ఉంది. కాగా, ఈ జాబితాలో క్వింటన్ డి కాక్ అగ్రస్థానంలో ఉన్నాడు. క్వింటన్ డి కాక్ 6 మ్యాచ్‌ల్లో 71.83 సగటుతో 431 పరుగులు చేశాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్, రచిన్ రవీంద్ర వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

Virat Kohli: పుట్టినరోజున స్పెషల్ కేక్ కట్ చేయనున్న కింగ్ కోహ్లీ.. ప్రత్యేకత ఏంటో తెలుసా?
Virat Kohli
Venkata Chari
|

Updated on: Oct 28, 2023 | 9:23 PM

Share

Virat Kohli Birthday Celebration: విరాట్ కోహ్లీ తన పుట్టినరోజును నవంబర్ 5న సెలబ్రేట్ చేసుకోనున్నాడు. భారత మాజీ కెప్టెన్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేయనున్నారు. అయితే, అదే రోజున అంటే అక్టోబర్ 5న భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా, ఈ రోజున విరాట్ కోహ్లీ పుట్టినరోజు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

విరాట్ కోహ్లి పుట్టినరోజును ప్రత్యేకంగా మార్చేందుకు ఈడెన్ గార్డెన్స్ సిబ్బందితో సహా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఎటువంటి అవకాశాన్ని వదలడం లేదు.

ఇవి కూడా చదవండి

విరాట్ కోహ్లీ పుట్టినరోజు కోసం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక సన్నాహాలు..

మీడియా కథనాల ప్రకారం, విరాట్ కోహ్లీ పుట్టినరోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సెలబ్రేట్ చేయనున్నారు. ఇందుకోసం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక సన్నాహాలు చేస్తోంది. విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా కేక్ ఏర్పాటు చేయనున్నారు. అయితే, విరాట్ కోహ్లీ పుట్టినరోజు కోసం భారత అభిమానులు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే, భారత మాజీ కెప్టెన్ నవంబర్ 5న తన 35వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోనున్నాడు. అదే సమయంలో ఆ రోజు భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది.

ప్రపంచకప్‌లో విరాట్‌ కోహ్లి బ్యాట్‌ దూకుడు..

2023 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 5 మ్యాచ్‌ల్లో 354 పరుగులు చేశాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లి సగటు 118గా ఉంది. కాగా, ఈ జాబితాలో క్వింటన్ డి కాక్ అగ్రస్థానంలో ఉన్నాడు. క్వింటన్ డి కాక్ 6 మ్యాచ్‌ల్లో 71.83 సగటుతో 431 పరుగులు చేశాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్, రచిన్ రవీంద్ర వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. సౌతాఫ్రికాకు చెందిన ఐడెన్ మర్క్రాం నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక విరాట్ కోహ్లీ 5వ స్థానంలో ఉండగా, పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ (333) ఆరో స్థానంలో ఉన్నారు. టీమిండియా సారథి 311 పరుగులతో 8వ స్థానంలో నిలిచాడు.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..