AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NZ vs BAN: కేన్‌ మామ దిగుతున్నాడోచ్.. బంగ్లాతో మ్యాచ్‌లో బరిలోకి విలియమ్సన్‌.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే?

వన్డే ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ఇవాళ (అక్టోబర్‌ 13) చెన్నైలోని చెపాక్‌ మైదానం వేదికగా న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మెగా క్రికెట్ టోర్నీలో న్యూజిలాండ్‌ టాప్‌ పెర్ఫామెన్స్‌తో దూసుకెళుతోంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఘన విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్‌ విజయం సాధించాలని బ్లాక్‌ క్యాప్స్‌ ఉవ్విళ్లూరుతోంది

NZ vs BAN: కేన్‌ మామ దిగుతున్నాడోచ్.. బంగ్లాతో మ్యాచ్‌లో బరిలోకి విలియమ్సన్‌.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే?
New Zealand Vs Bangladesh
Basha Shek
|

Updated on: Oct 13, 2023 | 11:00 AM

Share

వన్డే ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ఇవాళ (అక్టోబర్‌ 13) చెన్నైలోని చెపాక్‌ మైదానం వేదికగా న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మెగా క్రికెట్ టోర్నీలో న్యూజిలాండ్‌ టాప్‌ పెర్ఫామెన్స్‌తో దూసుకెళుతోంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఘన విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్‌ విజయం సాధించాలని బ్లాక్‌ క్యాప్స్‌ ఉవ్విళ్లూరుతోంది. ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓ మ్యాచ్ గెలిచిన బంగ్లాదేశ్‌.. మరో విజయం సాధించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ బంగ్లాను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే చెపాక్‌ పిచ్‌ స్పిన్నర్లకు స్వర్గధామం. ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఇది నిరూపితమైంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ జట్టులో టాప్‌ స్పిన్నర్లు ఉండడం, ఇక్కడ పరిస్థితులు బంగ్లా మాదిరిగానే ఉండడంతో ఇరు జట్లు హోరాహోరీ గా తలపడే అవకాశం ఉంది. అటు కివీస్‌ జట్టులోనూ మిచెల్ శాంట్నర్‌ ఉన్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన శాంట్నర్‌కు చెన్నై పిచ్‌పై పూర్తి అవగాహన ఉంది. ఇటు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు శుభవార్త అందింది. ఆ జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్ బంగ్లాతో మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్‌ 2023లో గాయపడిన విలియమ్సన్‌ అప్పటి నుంచి జట్టుకు దూరంగానే ఉన్నాడు. వరల్డ్‌ కప్‌లో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అర్ధసెంచరీ సాధించి టచ్‌లో వచ్చినప్పటికీ మెగా టోర్నీలో మొదటి రెండు మ్యాచ్‌లు ఆడలేదు. అయితే విలియమ్సన్‌ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించినట్లు తెలుస్తోంది. కేన్‌ మామ జట్టులో చేరడంతో కివీస్‌ బ్యాటింగ్‌ విభాగం మరింత పటిష్ఠంగా మారనుంది.

మరోవైపు కివీస్‌ స్టార్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదు. చేతి వేలి గాయంతో పడుతున్న అతను.. బంగ్లాతో మ్యాచ్‌లోనూ బరిలోకి దిగడం లేదు. అయితే లూకీ ఫెర్గూసన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జేమ్స్‌ నీషమ్‌, ఇష్‌ సోధి, మాట్ హెన్రీ, మిచెల్‌ సాంట్నర్‌లతో కూడిన కివీస్‌ బౌలింగ్‌ విభాగం పటిష్ఠంగానే ఉంది. ఇక బ్యాటింగ్‌లోనూ ఆ జట్టు ప్రత్యర్థి బౌలర్లకు సవాలు విసురుతోంది. ఓపెనర్లు డెవాన్‌ కాన్వు, రచిన్‌ రవీంద్రలు భీకర ఫామ్‌లో ఉన్నారు. అలాగే డారిల్‌ మిచెల్‌, టామ్‌ లాథమ్‌, గ్లెన్‌ ఫిలిమ్స్‌ ఏ పరిస్థితుల్లోనైనా దూకుడుగా ఆడగలరు. మరోవైపు వరల్డ్ కప్ ఆరంభంలోనే ఆఫ్ఘనిస్థాన్‌ పై గెలుపొందిన బంగ్లాదేశ్‌ రెండో మ్యాచ్ లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. దీంతో కివీస్‌పై విజయం సాధించి మళ్లీ విజయాల బాట పట్టాలని బంగ్లా టైగర్స్‌ భావిస్తున్నారు. లిటన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, నజ్ముల్ హుస్సేన్ శాంటోలు బ్యాటింగ్‌లో కీలకం కాగా.. తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్‌లో రాణించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

తుది జట్లు:

న్యూజిలాండ్‌:

డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్/ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్.

బంగ్లాదేశ్‌:

తాంజిద్ హసన్/మహ్మదుల్లా, లిట్టన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్, తౌహిద్ హృదయ్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్.

ప్రాక్టీసులో న్యూజిలాండ్ జట్టు..

View this post on Instagram

A post shared by BLACKCAPS (@blackcapsnz)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us