AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH నుంచి బయటికి..? అఫీషియల్‌గా క్లారిటీ ఇచ్చేసిన నితీష్‌ కుమార్‌ రెడ్డి! ఆ జట్టుతో బంధం..

నితీష్ కుమార్ రెడ్డి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నుంచి వేరే జట్టుకు వెళ్తున్నారనే పుకార్లను ఖండించారు. ఐపీఎల్ 2026లోనూ SRH తోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తాను ఎల్లప్పుడూ జట్టుకు అండగా ఉంటానని, వారితోనే ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం నితీష్‌ మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడు.

SRH నుంచి బయటికి..? అఫీషియల్‌గా క్లారిటీ ఇచ్చేసిన నితీష్‌ కుమార్‌ రెడ్డి! ఆ జట్టుతో బంధం..
Nithish Kumar Reddy
SN Pasha
|

Updated on: Jul 27, 2025 | 8:44 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 లో వేరే జట్టు తరఫున ఆడేందుకు తాను సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ను విడిచిపెట్టినట్లు వస్తున్న పుకార్లపై భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్పందించాడు. తాను ఎల్లప్పుడూ తన జట్టుకు అండగా నిలుస్తానని, వారి తరఫున ఆడుతూనే ఉంటానని క్లారిటీ ఇచ్చేశాడు.

ఎస్‌ఆర్‌హెచ్‌ను వీడి వేరే టీమ్‌కి వెళ్లిపోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా నితీష్ రెడ్డి గురించి వార్తలు వస్తున్నాయి. ఇటీవలె మోకాలి గాయంతో ఇంగ్లాండ్‌తో చివరి రెండు టెస్టులకు దూరం అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌తో విభేదాలతోనే జట్టును వీడుతున్నాడంటూ పుకార్లు వచ్చాయి. టీమ్‌లో తన పాత్ర పట్ల అసంతృప్తిగా ఉన్నాడని, ముఖ్యంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయాలని అనుకుంటున్నాడని, అందుకే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఒప్పుకోవడం లేదని నితీష్‌ అన్‌ హ్యపీగా ఉన్నాడని పుకార్లు వచ్చాయి. అందుకే జట్టును వీడుతున్నాడనే ప్రచారం జరిగింది.

దీనిపై స్పందించిన నితీష్‌ తన అధికారిక ఎక్స్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేస్తూ.. “నేను అనవసరపు విషయాలకు దూరంగా ఉంటాను, కానీ కొన్ని విషయాలకు స్పష్టత అవసరం. SRH తో నా సంబంధం నమ్మకం, గౌరవం, సంవత్సరాల ఉమ్మడి అభిరుచిపై నిర్మించబడింది. నేను ఎల్లప్పుడూ ఈ జట్టుకు అండగా నిలుస్తాను.” అని పేర్కొన్నాడు. ఈ స్టేట్‌మెంట్‌తో నితీష్‌ కుమార్‌రెడ్డి ఎస్‌ఆర్‌హెచ్‌ను వీడి పోవడం లేదనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.

కాగా IPL 2025 లో నితీష్ రెడ్డి అంత గొప్పగా రాణించలేదు. అతను బ్యాట్, బాల్‌తో ఇబ్బంది పడ్డాడు, 13 ఇన్నింగ్స్‌లలో కేవలం 182 పరుగులు మాత్రమే చేశాడు. 2023 లో ఫ్రాంచైజీతో తన IPL అరంగేట్రం చేసిన నితీష్‌ IPL 2024 లో అతని అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. 303 పరుగులు చేసి మూడు వికెట్లు తీసుకున్నాడు. 2025లో అతనిపై భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ వాటిని అందుకోలేకపోయాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్