IPL 2024: పాకిస్తాన్ పోయేది లేదు.. భారత్‌కే బ్యాగులు సర్దేస్తాం.. పీసీబీ షాక్ ఇవ్వనున్న న్యూజిలాండ్ క్రికెటర్లు..
New Zealand vs Pakistan: పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షెడ్యూల్ గురువారం విడుదలైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ ఏప్రిల్‌లో పాకిస్థాన్‌లో పర్యటించనుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ ఏప్రిల్ 18న జరగనుంది. రెండో మ్యాచ్ ఏప్రిల్ 20న, మూడో మ్యాచ్ ఏప్రిల్ 21న, నాలుగో మ్యాచ్ ఏప్రిల్ 25న, ఐదో మ్యాచ్ ఏప్రిల్ 27న జరగనున్నాయి. సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు ఏప్రిల్ 14న పాకిస్థాన్‌కు వెళ్లనుంది.

IPL 2024: ఐపీఎల్ 2024 (IPL 2024) మార్చి 22 నుంచి ప్రారంభమవుతుంది. దీంతో యావత్ ప్రపంచం దృష్టి ఈ లీగ్ పైనే పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడనున్నారు. న్యూజిలాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్‌కు చెందిన పలువురు క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడటం చూడవచ్చు. అయితే న్యూజిలాండ్ క్రికెటర్ల(New Zealand Cricket)కు ఓ సమస్య తలెత్తింది. ఈ లీగ్ మధ్యలో న్యూజిలాండ్, పాకిస్థాన్(New Zealand vs Pakistan)పర్యటించాల్సి ఉంది. కాబట్టి, కివీ క్రికెటర్లు తమ దేశం కోసం ఆడతారా, జాతీయ విధిని నిర్వహించడానికి IPL నుంచి విరామం తీసుకుంటారా? లేక పాక్ టూర్ ను పట్టించుకోకుండా ఐపీఎల్ కు ప్రాధాన్యత ఇస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షెడ్యూల్ గురువారం విడుదలైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ ఏప్రిల్‌లో పాకిస్థాన్‌లో పర్యటించనుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ ఏప్రిల్ 18న జరగనుంది. రెండో మ్యాచ్ ఏప్రిల్ 20న, మూడో మ్యాచ్ ఏప్రిల్ 21న, నాలుగో మ్యాచ్ ఏప్రిల్ 25న, ఐదో మ్యాచ్ ఏప్రిల్ 27న జరగనున్నాయి. సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు ఏప్రిల్ 14న పాకిస్థాన్‌కు వెళ్లనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 28న కివీస్ జట్టు బయలుదేరే అవకాశం ఉంది. అంటే దాదాపు 14 రోజుల పాటు న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించనుంది.
ఆటగాళ్ళు ఏమి చేస్తారు?
నిజానికి ఈ రెండు జట్ల టీ20 సిరీస్ ఐపీఎల్‌కు కాస్త ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే న్యూజిలాండ్ జట్టులోని చాలా మంది స్టార్ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడుతున్నారు. న్యూజిలాండ్ తరపున ప్రపంచకప్‌లో మెరిసిన రచిన్ రవీంద్ర, సెమీఫైనల్‌లో భారత్‌పై సెంచరీ సాధించిన డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, గ్లెన్ ఫిలిప్స్, లాకీ ఫెర్గూసన్ ఐపీఎల్‌లో పాల్గొననున్నారు. అలాగే ఈ ఆటగాళ్లు న్యూజిలాండ్ టీ20 జట్టులో ముఖ్యమైన సభ్యులు. కాబట్టి ఈ ఆటగాళ్లు ఐపీఎల్‌కు మొగ్గు చూపుతారా లేక జాతీయ జట్టుకు మొగ్గు చూపుతారా అనేది చూడాలి.
ఇటీవల ముగిసిన SA20 లీగ్ సందర్భంగా, ఈ లీగ్‌లో ఆడేందుకు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు జాతీయ జట్టు నుంచి వైదొలిగారు. అయితే, అదే సమయంలో దక్షిణాఫ్రికా జట్టు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడింది. ఆ సమయంలో ఆఫ్రికా జట్టులో కొత్తవారికి అవకాశం కల్పించారు. ఆ జట్టు కెప్టెన్ కూడా కొత్తవాడే కావడం గమనార్హం. ఇప్పుడు దక్షిణాఫ్రికా మాదిరిగా పాకిస్థాన్ పర్యటనకు న్యూజిలాండ్ క్రికెట్ కొత్త జట్టును పంపుతుందా లేక అనుభవం ఉన్న జట్టును పంపుతుందా అనేది చూడాలి.
లీగ్‌కు ప్రాధాన్యం..
ప్రస్తుతం చాలా మంది ఆటగాళ్లు టీ20 లీగ్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వెస్టిండీస్ ఆటగాళ్లు దీనికి మంచి ఉదాహరణ. ఇప్పుడు ఇతర దేశాల ఆటగాళ్లు కూడా ఈ పని మొదలుపెట్టారు. ఈ కారణంగా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బౌల్ట్ వైదొలిగాడు. దీన్నిబట్టి చూస్తే బౌల్ట్ పాక్ టూర్ కు వెళ్లకపోవటం దాదాపు ఖాయం. మరి మిగతా ఆటగాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








