Hardik Pandya: ‘నా బిడ్డొచ్చిండు’.. చాలా రోజుల తర్వాత హార్దిక్‌ పాండ్యా ఇంటికి అగస్త్య.. ఫొటోస్ వైరల్

సుమారు నెలన్నర రోజుల తర్వాత అగస్త్య తిరిగి తన తండ్రి దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో హార్దిక్ పాండ్యా తన బిడ్డతో ఖుషి ఖుషిగా గడుపుతున్నాడు. ఇటీవల నటాషా స్టాంకోవిచ్ మళ్లీ ముంబయికి తిరిగి వచ్చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇందులో ఎక్కడా ఆగస్త్య కనిపించలేదు

Hardik Pandya: 'నా బిడ్డొచ్చిండు'.. చాలా రోజుల తర్వాత హార్దిక్‌ పాండ్యా ఇంటికి అగస్త్య.. ఫొటోస్ వైరల్
Hardik Pandya
Follow us

|

Updated on: Sep 04, 2024 | 6:00 PM

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యాతో విడాకుల ప్రకటన అనంతరం వెంటనే తన పుట్టింటికి వెళ్లిపోయింది నటాషా స్టాంకోవిచ్. కుమారుడు అగస్త్యను తీసుకుని సెర్బియాకు వెళ్లిపోయింది. అక్కడే తన 4వ పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. దీంతో హార్దిక్ పాండ్యా తన కుమారుడిని గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో ఎమోషనల్ పోస్టులు పెట్టాడు. అయితే సుమారు నెలన్నర రోజుల తర్వాత అగస్త్య తిరిగి తన తండ్రి దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో హార్దిక్ పాండ్యా తన బిడ్డతో ఖుషి ఖుషిగా గడుపుతున్నాడు. ఇటీవల నటాషా స్టాంకోవిచ్ మళ్లీ ముంబయికి తిరిగి వచ్చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇందులో ఎక్కడా ఆగస్త్య కనిపించలేదు. దీంతో నటాషా ఒంటరిగానే ముంబైకు వచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే అందులో వాస్తవం లేదని తెలిసింది. విడాకుల ప్రక్రియకు సంబంధించి కొన్ని పనులు పూర్త చేయడనికి అగస్త్యను వెంట తీసుకునే నటాషా ముంబై వచ్చిందని సమాచారం. హార్దిక్ ఫ్యామిలీ కూడా ముంబైలోనే ఉండడంతో అగస్త్యను అక్కడికి పంపించిందట నటాషా.

ఇవి కూడా చదవండి

హార్దిక్‌ వదిన, క్రికెటర్‌ కృనాల్‌ పాండ్యా భార్య పాంఖురి శర్మ షేర్‌ చేసిన ఫొటోల ద్వారా ఈ విషయం వెల్లడైంది. తన కుమారుడు కవిర్‌తో కలిసి అగస్త్యకు కథలు చెప్తున్నానంటూ పాంఖురి సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. చాల రోజుల తర్వాత కుమారుడు ఇంటికి రావడంతో హార్దిక్ ఫుల్ ఖుషీగా ఉన్నాడని సమాచారం. హార్దిక్ పాండ్య, నటాషాలది ప్రేమ వివాహం. 2020 మే 31న కరోనా సమయంలో మొదటిసారిగా సింపుల్ గా వీరి వివాహం జరిగింది. వారికి అదే ఏడాదిలో అగస్త్య పుట్టాడు. ఆ తర్వాత పిల్లాడి సమక్షంలో మళ్లీ గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు హార్దిక్- నటాషా. అయితే నాలుగేళ్ల కలిసున్న తర్వాత వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ ఏడాది జులైలో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు హార్దిక్- నటాషా. అయితే కో-పేరెంట్స్‌గా అగస్త్యకి తాము చేయాల్సిందంతా చేస్తామని ఇద్దరూ వెల్లడించారు. హార్దిక్ తో విడిపోయినట్లు ప్రకటించిన వెంటనే అగస్త్యను తీసుకుని సెర్బియాకు వెళ్లిపోయింది నటాషా.

హార్దిక్ పాండ్యా ఇంట్లో అగస్త్య.. వీడియో ఇదిగో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!