Mumbai Indians: మిషన్ 2023 ప్రారంభం.. ఇంగ్లండ్ వెళ్లనున్న ముంబై ఇండియన్స్ ప్లేయర్లు.. ఎందుకంటే?

ఐపీఎల్ 15వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ చాలా పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. కాగా, ఈ ఫ్రాంచైజీ ఇప్పటికే తదుపరి సీజన్ కోసం సన్నాహాలు ప్రారంభించింది.

Mumbai Indians: మిషన్ 2023 ప్రారంభం.. ఇంగ్లండ్ వెళ్లనున్న ముంబై ఇండియన్స్ ప్లేయర్లు.. ఎందుకంటే?
Ipl 2023 Mumbai Indians
Venkata Chari

|

Jun 28, 2022 | 8:46 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో పేలవమైన ప్రదర్శన తర్వాత, ముంబై ఇండియన్స్(Mumbai Indians) తదుపరి సీజన్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఫ్రాంచైజీ తమ అంతర్జాతీయ అరంగేట్రం చేయని భారత ఆటగాళ్లను జూలైలో మూడు నెలల శిక్షణ కోసం ఇంగ్లాండ్‌ తీసుకెళ్లనుంది. ఆధునిక కేంద్రాలలో శిక్షణతో పాటు, ముంబై ఇండియన్స్‌లోని యువ భారతీయ ఆటగాళ్లు బహుళ కౌంటీల నుంచి అగ్రశ్రేణి క్లబ్ జట్లతో కనీసం 10 T20 మ్యాచ్‌లు ఆడే అవకాశాన్ని పొందేందుకు ప్లాన్ చేశారు. కొన్ని వర్గాల సమాచారం మేరకు “ఎన్‌టీ తిలక్ వర్మ, కుమార్ కార్తికేయ, రమణదీప్ సింగ్, హృతిక్ షోకీన్ వంటి కొంతమంది ఆటగాళ్లు క్లిష్ట పరిస్థితుల్లో టాప్ T20 క్లబ్‌ల జట్టుతో ఆడిన అనుభవాన్ని పొందుతారు. యూకేలో ఉన్న అర్జున్ టెండూల్కర్, దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ కూడా జట్టులో చేరే అవకాశం ఉంది’’ అని తెలిపారు.

ఆటగాళ్లపై ఓ కన్నేసిన జయవర్ధనే..

భారత ఆటగాళ్ల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ సహాయక సిబ్బంది కూడా ఇంగ్లండ్‌లో ఉంటారు. ఈమేరకు వినిపిస్తున్న వార్తల మేరకు.. భారత్‌లొ హోమ్ సీజన్ ముగిసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు జాతీయ జట్టుతో ఉన్నారు. మన అంతర్జాతీయ స్టార్లు కూడా తమ కమిట్‌మెంట్‌లతో బిజీగా ఉన్నారు. తదుపరి దేశవాళీ సీజన్ ప్రారంభానికి ముందు మూడున్నర నెలల పాటు ఎటువంటి మ్యాచ్ ప్రాక్టీస్‌ను పొందలేని యంగ్ ప్లేయర్‌ల కోసం ఈ ప్లాన్ చేశాం” అని వారు చెప్పుకొచ్చారు.

యూకే పర్యటనకు ఏ ఆటగాళ్లు వెళ్లవచ్చు?

NT తిలక్ వర్మ, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, మయాంక్ మార్కండే, రాహుల్ బుద్ధి, రమణదీప్ సింగ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్, ఆర్యన్ జుయల్, ఆకాష్ మేధావాల్, అర్షద్ ఖాన్, అర్జున్ టెండూల్కర్, డెవాల్డ్ బ్రీవిస్ (విదేశీయుడు) ఇంగ్లండ్‌లో ప్రాక్టీస్ చేసే ఛాన్స్ ఉంది.

ఐపీఎల్ 2022లో కలచెదిన ముంబై జట్టు..

ఇవి కూడా చదవండి

IPL 2022 ముంబై ఇండియన్స్ జట్టుకు చాలా చెడ్డది. ఫ్రాంచైజీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. ఈ జట్టు 14 మ్యాచ్‌లలో 4 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. తొలి 8 మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై 9వ మ్యాచ్‌లో అతి కష్టం మీద విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వచ్చే సీజన్ కోసం, ముంబై తన యువ ఆటగాళ్లను పరిణతి చెందేలా చేయడానికి ఇంగ్లాండ్‌లో శిక్షణ పొందాలని ప్లాన్ చేసింది. సహజంగానే ఫ్రాంచైజీ దీని ప్రయోజనాన్ని పొందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu