6 ఏళ్లుగా టీమిండియాతోనే జర్నీ.. వన్డే, టీ20ల్లో అద్భుత ప్రదర్శన.. కానీ, ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలే.. ఎవరో తెలుసా?

Team India: టీమ్ ఇండియా మిస్టరీ స్పిన్నర్ కెరీర్ 6 సంవత్సరాలకు పైగా ఉంది. కానీ, ఈ ఆటగాడు ఇంకా ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం.

6 ఏళ్లుగా టీమిండియాతోనే జర్నీ.. వన్డే, టీ20ల్లో అద్భుత ప్రదర్శన.. కానీ, ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలే.. ఎవరో తెలుసా?
Yuzvendra Chahal
Venkata Chari

|

Jun 28, 2022 | 7:44 PM

Yuzvendra Chahal: క్రికెట్‌లో టెస్ట్ మ్యాచ్ అనేది అతిపెద్ద ఫార్మాట్. ఇందులో ఆడాలనేది ప్రతి ఆటగాడు కలలు కంటుంటాడు. కానీ చాలా తక్కువ మంది ఆటగాళ్లు టెస్టు జట్టులో చేరగలుగుతున్నారు. టీమ్ ఇండియాలో కూడా అలాంటి బౌలర్ ఉన్నాడు. అతని క్రికెట్ కెరీర్ టీమిండియాలో 6 సంవత్సరాలకు పైగా నడుస్తూనే ఉంది. కానీ, ఒక్కసారి కూడా టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. దీంతో ఈ ఏడాదైనా టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మాజీలు, విదేశీ క్రికెటర్లు సైతం ఈ ప్లేయర్‌ను టెస్టుల్లో ఆడించాలని బీసీసీఐను కోరుతున్నారు. ఇంతకీ ఆయనెవరో చెప్పలేదు కదా.. అక్కడికే వస్తున్నాం.. టీమిండియా సూపర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాం.

ఒక్క టెస్ట్ మ్యాచైనా ఆడాలని ఆరాటపడ్డాడు..

ఐపీఎల్ 2016లో యుజ్వేంద్ర చాహల్.. తన అద్భుతమైన ఆటతీరుతో టీమ్ ఇండియాలో చోటు సంపాదించాడు. ఈ ఆటగాడు వన్డేలు, టీ20లలో టీమ్ ఇండియా కోసం చాలా మ్యాచ్‌లు గెలిచాడు. కానీ, టెస్ట్ క్రికెట్‌లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆడలేదు. టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా యుజ్వేంద్ర చాహల్ నిలిచాడు.

టెస్ట్ జట్టులో చేరాలనే డిమాండ్..

ఇంగ్లండ్ మాజీ బౌలర్ గ్రేమ్ స్వాన్ ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ యుజ్వేంద్ర చాహల్‌ను టెస్టు జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈమేరకు గ్రేమ్ స్వాన్ మాట్లాడుతూ, ‘నేను సెలెక్టర్‌గా ఉంటే, అతను టెస్ట్ ఆడాలనుకుంటున్నారా లేదా అని చాహల్‌ను నేరుగా అడుగుతాను. ఆడాలని అనుకుంటే టీమ్‌లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేవాడిని. నా అభిప్రాయం ప్రకారం అతను ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్. ప్రతికూల పరిస్థితుల్లో ముఖ్యంగా బంతిపై మంచు పడి తడిగా ఉన్నప్పుడు అద్భుతంగా రాణిస్తాడు’ అని చెప్పుకొచ్చాడు.

అత్యుత్తమ వైట్ బాల్ స్పిన్నర్..

ఇవి కూడా చదవండి

గ్రేమ్ స్వాన్ యుజ్వేంద్ర చాహల్‌ను ప్రశంసిస్తూ, ‘యుజీ ప్రస్తుతం అత్యుత్తమ వైట్ బాల్ స్పిన్నర్ అని నేను చెప్పగలను. ఎందుకంటే అతను అత్యుత్తమ రెడ్ బాల్ స్పిన్నర్ కాగలడో లేదో మాకు తెలియదు. కానీ, కొంతమంది క్రికెటర్లు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో పరిమితం అవుతున్నారని చూపిస్తుంది. టెస్టు క్రికెట్‌కు సంబంధించినంత వరకు, ఇది చాలా ఆరోగ్యకరమైనదని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. జట్లు మరింత దూకుడుగా ఉండటంతో, టెస్టులపై మక్కువ మళ్లీ పుంజుకుంటుంది’ అని తెలిపాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu