IPL 2023: ఇకపై అలా చేస్తే.. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటా: మిస్టర్ కూల్ స్ట్రాంగ్ వార్నింగ్..
MS Dhoni Statement: చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయం తర్వాత ధోనీ తన జట్టు బౌలర్లపై అసంతృప్తిగా కనిపించాడు.

MS Dhoni Statement: IPL 2023లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌పై ఘోర పరాజయం తర్వాత.. చెపాక్ స్టేడియంలో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో లక్నోపై కేవలం 12 పరుగుల తేడాతో విజయం సాధిచింది. అయితే, ఈ మ్యాచ్‌లో విజయం తర్వాత, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తన జట్టు బౌలర్లపై అసంతృప్తిగా కనిపించాడు. కెప్టెన్సీని వదులుకుంటానంటూ ఘాటుగా హెచ్చరించాడు.
ఫాస్ట్ బౌలర్లపై అసంతృప్తి వ్యక్తం..
మ్యాచ్ అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ.. ‘ఫాస్ట్ బౌలింగ్‌లో మరింత మెరుగుదల అవసరం. పరిస్థితిని బట్టి మార్పులు చేయాలి. ప్రత్యర్థి బౌలర్లు ఏం చేస్తున్నారో గమనించడం ముఖ్యం. మరో విషయం ఏమిటంటే నో బాల్స్, ఎక్స్‌ట్రా వైడ్‌లు అస్సలు వేయకూడదు. లేదంటే కొత్త కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుంది. ఇది నా రెండవ హెచ్చరిక అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. మరోసారి ఇలా జరిగితే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాను అంటూ అసహనం వ్యక్తం చేశాడు.
నోబాల్, వైడ్ బాల్స్ విసిరిన చెన్నై బౌలర్లు..
లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచినప్పటికీ, ఈ మ్యాచ్‌లో CSK బౌలర్లు చాలా పేలవమైన రిథమ్‌లో కనిపించారు. ఈ మ్యాచ్‌లో చెన్నై బౌలర్లు మొత్తం 3 నో బాల్స్, 13 వైడ్ బాల్స్ విసిరారు. ఈ విధంగా జట్టు 18 అదనపు పరుగులు సమర్పించుకంది. అదే సమయంలో లక్నో బౌలర్లు కూడా ఈ విషయంలో వెనకడుగు వేయలేదు. ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్లు 1 నోబాల్, 7 వైడ్ బాల్స్ విసిరారు. మొదటి మ్యాచ్‌లో కూడా చెన్నై బౌలర్లు 2 నోబాల్స్, 4 వైడ్ బాల్స్ వేసిన సంగతి తెలిసిందే.




చెపాక్ వికెట్ చూసి ఆశ్చర్యపోయిన కెప్టెన్ కూల్..
పిచ్ గురించి ధోనీ మాట్లాడుతూ, “ఇది అధిక స్కోరింగ్ గేమ్. వికెట్ ఎలా ఉంటుందోనని మేమంతా ఆశ్చర్యపోయాం. ఇక్కడ మొదటి గేమ్. కాస్త స్లో అవుతుందని అనుకున్నాను. కానీ, ఇది పరుగులు చేయగలిగిన పిచ్. వికెట్ చూసి ఆశ్చర్యపోయాను’ అంటూ తెలిపాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




