MS Dhoni: భారతీయుల కల నెరవేర్చిన సిక్స్.. ఆ స్పెషల్ ప్లేస్‌కు ఎంఎస్ ధోనీ పేరు..
MS Dhoni Winning Six: ప్రపంచకప్ విజయానికి గుర్తుగా వాంఖడే స్టేడియంలో విజయ స్మారకాన్ని నిర్మించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది.

MS Dhoni Winning Six: ధోని గెలిచిన సిక్స్ మెమోరియల్: 12 సంవత్సరాల క్రితం, ఈ రోజు ఏప్రిల్ 2, 2011న ముంబైలోని వాంఖడే స్టేడియంలో, శ్రీలంకను ఓడించిన టీమిండియా.. రెండవసారి వన్డే క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 28 ఏళ్ల తర్వాత భారత్ వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని భారతీయులెవరూ మర్చిపోలేరు. 2011 ప్రపంచకప్ విజయానికి గుర్తుగా వాంఖడే స్టేడియంలో చిన్నపాటి విజయ స్మారకాన్ని నిర్మించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది.
ఎంఎస్ ధోని కొట్టిన భారీ సిక్స్‌తో టీమిండియా విజయం సాధించింది. అయితే, స్టాండ్స్‌లో బంతి పడిన సీటుకు దోనీ పేరు పెట్టాలని నిర్ణయించారు. ఆఖరి మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని సిక్సర్ కొట్టడంతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సహా కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది.
ధోనీని సన్మానించనున్న ముంబై క్రికెట్ అసోసియేషన్..
ముంబై క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అజింక్యా నాయక్ మాట్లాడుతూ ఐపీఎల్ టోర్నమెంట్ సందర్భంగా ఏప్రిల్ 8న ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఆ రోజు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చాలా కాలం తర్వాత ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడనున్నాడు. భారత క్రికెట్‌కు ధోని చేసిన సేవలకు, 2011లో వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో భారత్‌కు ప్రపంచకప్ గెలవడంలో సహకరించినందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ గౌరవిస్తుందని నాయక్ ప్రకటించారు.




2011 ప్రపంచకప్ ఫైనల్‌లో ధోనీ కొట్టిన బాల్ ఎక్కడ పడిందో.. ఆ సీటు ఉన్న ప్రదేశంలో విజయ స్మారకాన్ని నిర్మించాలని MCA అధ్యక్షుడు అమోల్ కాలే నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు కార్యదర్శి అజింక్యా నాయక్, ఇతర సభ్యులు మద్దతు ఇచ్చారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తి అని ఎంసీఏ సెక్రటరీ అజింక్యా నాయక్ పేర్కొన్నారు.
ప్రపంచకప్ విజయం గొప్పదని, ప్రతి యువ క్రికెటర్‌కు స్ఫూర్తినిస్తుందని నాయక్ చెప్పుకొచ్చారు. విజయ్ స్మారక చిహ్నం నిర్మించడం వెనుక ఉద్దేశ్యం భారత క్రికెట్ సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడమేనని, దేశం కోసం తమ అత్యుత్తమమైన వాటిని అందించడానికి క్రికెటర్లను ప్రేరేపించడమేనని ఆయన అన్నారు. మహేంద్ర సింగ్ ధోనీ ముంబైకి రాగానే వాంఖడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




