MS Dhoni vs Gambhir: కోపంతో చేశాడా.. కావాలనే చేశాడా..? గంభీర్‌పై ధోనీ అభిమానుల ఫైర్!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. నిన్న (బుధవారం, జులై 7న) 40వ పుట్టిన రోజు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమేరకు సోషల్ మీడియాలో ధోనీ పేరుతో అభిమానులు సందడి చేసిన సంగతి తెలిసిందే.
MS Dhoni vs Gambhir: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. నిన్న (బుధవారం, జులై 7న) 40వ పుట్టిన రోజు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమేరకు సోషల్ మీడియాలో ధోనీ పేరుతో అభిమానులు సందడి చేసిన సంగతి తెలిసిందే. అలాగే సెలబ్రిటీల నుంచి సామన్య జనం దాకా అందరూ.. ఈ మిస్టర్ కూల్ కి శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే, టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మహేంద్రుడిని విష్ చేయడం మరిచిపోయినట్లున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, మరో విషయంలోనూ నిన్న ధోనీ అభిమానులు కోపం ప్రదర్శించారు. మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌పై వ్యవహారం క్రికెట్ అభిమానుల కోపానికి కారణంగా మారింది. ధోనీ అభిమానులైతే.. గంభీర్‌పై దారుణంగా కామెంట్లు చేశారు. అసలు విషయంలోకి వెళ్తే.. గౌతం గంభీర్ నిన్న తన ఫేస్‌బుక్ కవర్ ఫొటోని తొలగించాడు. అయితే ఇందులో ఏముంది అనుకుంటున్నారా.. జార్ఖండ్ డైనమేట్ అభిమానుల ఆగ్రహానికి ఆజ్యం పోసిందే ఈ కవర్ ఫొటో. 2011 ప్రపంచకప్ ఫైనల్లో గంభీర్ 97 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే. ఆనాటి ఫొటోను కవర్ పేజ్‌లో చేర్చాడు. అయితే, ఇన్నాళ్లు ఉంచిన ఈ ఫొటోను ధోనీ పుట్టిన రోజు నాడే మార్చేశాడు. దీంతో మిస్టర్ కూల్ ఫ్యాన్స్ గంభీర్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే, గంభీర్ ఇది కావాలని చేశాడా? లేక మాములుగానే మార్చాడో తెలియదు కానీ, క్రికెట్ ప్రేమికులు మాత్రం తెగ ట్రోల్ చేసేశారు.
ధోనీ విజయాలను తట్టుకోలేకే గంభీర్ ఇలా చేశాడని, గంభీర్ కి పొగరు ఎక్కువంటూ కామెంట్లు చేశారు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన ధోనీ.. రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలని, కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేప్పుడు గంభీర్ స్వాగతం పలకాలని, అప్పుడు ఉంటుంది అసలు మజా.. అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
2011 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్, శ్రీలంక తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ 122 బంతుల్లో 9 ఫోర్లతో 97 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. సచిన్, సెహ్వాగ్ ప్రారంభంలోనే కోల్పోవడంతో టీమిండియా కష్టాల్లో కూరుకపోయింది. విరాట్ కోహ్లీ (35)తో కలిసి గంభీర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కోహ్లీ ఔటయ్యాక.. ధోనీతో కలిసి గంభీర్ దూకుడు పెంచాడు. అయితే, సెంచరీ వైపు వెళ్తున్న క్రమంలో గంభీర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇలా ఔటవ్వడానికి ధోనీనే కారణమని చాలా ఇంటర్వ్యూల్లో గౌతమ్ గంభీర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. తన స్కోర్ చెప్పడంతోనే తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయని, అందుకే ఔట్ అయ్యాయని తెలిపాడు. అలాగే 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ గంభీర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, ఈ రెండు మ్యాచుల్లో గౌతమ్ గంభీర్‌కు రావాల్సిన పేరు రాలేదు. ఈమేరకు చాలా అసహనంతో క్రికెట్‌కు గంభీర్ గుడ్‌బాయ్ చెప్పేశాడు.
If you are going to be salty, be as salty as Gautam Gambhir…. Go big or go home… pic.twitter.com/IbWGscyCH4
— Gappistan Radio (@GappistanRadio) July 7, 2021
Gambhir’s annual reminder on Dhoni’s birthday. ? pic.twitter.com/6HNic9nwFt
— Sumit (@_RKSumit) July 7, 2021
People think they are ? when they troll Gambhir for his predictions,political matters and even when he change his so called Cover Picture,Seriously!?He is the legend of ICT and unsung hero of 2WCs. the thing is His DIRT on SHIRT is far better than ur whole career @GautamGambhir pic.twitter.com/5na50BtE2V
— ?raneeeeeeth? (@Ethan_Hunt41) July 7, 2021
Also Read:
Euro Cup 2020: 55 ఏళ్ల తరువాత ఫైనల్ చేరిన ఇంగ్లండ్.. ఇటలీతో తుదిపోరుకు రెడీ!
Copa America Football: ఫైనల్ చేరిన అర్జెంటీనా.. కొలంబియాపై తిరుగులేని విజయం.. 15వ సారి కప్ కోసం..!
Happy Birthday Sourav Ganguly: 49వ వసంతంలోకి బెంగాల్ టైగర్.. విదేశాల్లో విజయాలకు కేరాఫ్ అడ్రస్..!