టెస్టుల్లో వీరోచిత ఇన్నింగ్స్.. బౌలర్లను ఉతికి ఆరేశాడు.. సూపర్ సెంచరీతో అదరగొట్టిన మాజీ ఆర్సీబీ ప్లేయర్!
సాధారణంగా లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పెద్ద ఇన్నింగ్స్ ఆడటం చాలా అరుదు. టెస్టుల్లో ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకుని బ్యాటింగ్ చేయాలంటే .

సాధారణంగా లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పెద్ద ఇన్నింగ్స్ ఆడటం చాలా అరుదు. టెస్టుల్లో ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకుని బ్యాటింగ్ చేయాలంటే అద్భుతమైన టెక్నిక్ ఉండాలి. ఓ బ్యాట్స్‌మెన్ కష్టాల్లో ఉన్న తన టీంను ఆదుకుని గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆ మాజీ ఆర్సీబీ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
హాంప్‌షైర్, సర్రే మధ్య జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచిన న్యూజిలాండ్ ఆటగాడు కొలిన్ డి గ్రాండ్హోమ్ ఆరవ స్థానంలో బ్యాటింగ్ చేసి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం 174 పరుగులు చేసిన ఈ బ్యాట్స్‌మెన్ చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. దీనితో 488 పరుగులకు ఆలౌట్ అయింది. 155 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన హాంప్షైర్.. గ్రాండ్హోమ్ సహాయంతో 488 పరుగులు చేయగలిగింది. గ్రాండ్హోమ్.. తన ఇన్నింగ్స్‌లో 213 బంతులు ఎదుర్కుని 17 ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. డి గ్రాండ్‌హోమ్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోర్.
సుమారు 8 మంది బౌలర్లపై గ్రాండ్‌హోమ్ విశ్వరూపం చూపించాడు. అతడ్ని అవుట్ చేసేందుకు ప్రత్యర్ధి జట్టు ఎన్ని ప్రయత్నాలు చేసిన అన్ని విఫలమయ్యాయి. గ్రాండ్‌హోమ్ ఎనిమిదో వికెట్‌కు ఫెలిక్స్ ఆర్గాన్‌తో కలిసి127 పరుగులు, చివరి బ్యాట్స్‌మెన్ బ్రాడ్ వీల్‌తో కలిసి 10వ వికెట్‌కు 114 పరుగులు జోడించాడు.
గ్రాండ్‌హోమ్ ఇన్నింగ్స్ ఈ వీడియోలో చూడండి..
The most Colin de Grandhomme-esque way to bring up 1️⃣5️⃣0️⃣
Standby for highlights from all 7 #CountyChampionship matches on Spark Sport ?⭕️ pic.twitter.com/DMHnviudBB
— Spark Sport (@sparknzsport) July 5, 2021
Also Read:
ఏపీలో పాఠశాలల పున:ప్రారంభం అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి!
సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్.. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు టికెట్ ధరలు.!
కాబోయే భర్త రేప్ చేశాడంటూ మహిళ కేసు.. హైకోర్టు సంచలన తీర్పు.!
ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలెర్ట్.. అకడమిక్ క్యాలెండర్ షెడ్యూల్ ఖరారు.. మొత్తం 213 పనిదినాలు.!




