Happy Birthday Sourav Ganguly: 49వ వసంతంలోకి బెంగాల్ టైగర్.. విదేశాల్లో విజయాలకు కేరాఫ్ అడ్రస్..!

సౌరవ్ గంగూలీ... భారత జట్టును కొన్నేళ్లపాటు విజయపథంలో నడిపించిన అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. దాదా కెప్టెన్సీలోనే టీమిండియా విదేశాల్లో ఎక్కువ విజయాలను నమోదు చేసింది.

Happy Birthday Sourav Ganguly: 49వ వసంతంలోకి బెంగాల్ టైగర్.. విదేశాల్లో విజయాలకు కేరాఫ్ అడ్రస్..!
Happy Birthday Sourav Ganguly
Follow us

|

Updated on: Jul 08, 2021 | 7:37 AM

Happy Birthday Sourav Ganguly: సౌరవ్ గంగూలీ… భారత జట్టును కొన్నేళ్లపాటు విజయపథంలో నడిపించిన అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. దాదా కెప్టెన్సీలోనే టీమిండియా విదేశాల్లో ఎక్కువ విజయాలను నమోదు చేసింది. గంగూలీ ఆట పట్ల ఎంతో ఫ్యాషన్‌గా ఉండేవాడు. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో చొక్కావిప్పి సంబురాలు చేసి, వార్తల్లో నిలిచాడు. భారత క్రికెట్ కు ఎన్నో మరిచిపోలేని విజయాలు అందించి, విశేష సేవలు అందిస్తోన్న ఈ బెంగాల్ టైగర్, భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పుట్టిన రోజు నేడు (జులై 8). 49వ వసంతంలోకి అడుగుపెడుతున్న దాదా కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతోంది టీవీ9 తెలుగు.

గంగూలీ కెరీర్ లో నాట్వెస్ట్ సిరీస్‌లో చిరస్మరణీయ విజయానికి సారథిగా నిలిచాడు. ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్‌లో విజయం సాధించిన తరువాత వహించాడు. లార్డ్స్ మైదానంలో గంగూలీ తన చొక్కా విప్పి సంబురాలు చేశాడు. 2003 లో గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా ప్రపంచ కప్ ఫైనల్ చేరుకుంది. కానీ, చివరి ఆటలో ఆస్ట్రేలియా చేతిలో ఘోరపరాజయం పాలైంది. అయితే, గంగూలీ సారథ్యంలో టీమిండియాలోకి అడుగుపెట్టిన చాలామంది ఆటగాళ్లు.. భారత క్రికెట్‌లో తమ పేరును లిఖించుకున్నారు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ ఇలా ఎందరో ఆటగాళ్లు.. దాదా టైంలోనే ఎంట్రీ ఇచ్చారు.

గంగూలీ కెరీర్ లో నాట్వెస్ట్ సిరీస్‌లో చిరస్మరణీయ విజయానికి సారథిగా నిలిచాడు. ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్‌లో విజయం సాధించిన తరువాత వహించాడు. లార్డ్స్ మైదానంలో గంగూలీ తన చొక్కా విప్పి సంబురాలు చేశాడు. 2003 లో గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా ప్రపంచ కప్ ఫైనల్ చేరుకుంది. కానీ, చివరి ఆటలో ఆస్ట్రేలియా చేతిలో ఘోరపరాజయం పాలైంది. అయితే, గంగూలీ సారథ్యంలో టీమిండియాలోకి అడుగుపెట్టిన చాలామంది ఆటగాళ్లు.. భారత క్రికెట్‌లో తమ పేరును లిఖించుకున్నారు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ ఇలా ఎందరో ఆటగాళ్లు.. దాదా టైంలోనే ఎంట్రీ ఇచ్చారు. ఎడమచేతి వాటం గల గంగూలీ 1992 లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అనంతరం నాలుగు సంవత్సరాల తరువాత లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ టీంతో జరిగిన టెస్టుతో అరంగేట్రం చేసి, సెంచరీ నమోదు చేశాడు.

గంగూలీ 311 వన్డేల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి 11,363 పరుగులు చేశాడు. ప్రస్తుతం వన్డేల్లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మూడవ స్థానంలో నిలిచాడు. మొత్తంగా ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు. సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ జోడీ వన్డేల్లో ఓపెనింగ్‌కి దిగి, ఎన్నో మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ జోడీ 6,609 పరుగులు సాధించి, అత్యధిక పరుగులు చేసిన రికార్డును నెలకొల్పారు. గంగూలీ 22 సెంచరీలు, 72 అర్ధ సెంచరీలు చేశాడు. 113 టెస్టులు ఆడిన దాదా.. 42.17 సగటుతో 7,212 పరుగులు పూర్తి చేశాడు.

2006 ప్రారంభంలో, గంగూలీ కెరీర్ ముగిసిందనే చెప్పాలి. అప్పటి కోచ్ గ్రెగ్ చాపెల్‌తో విభేదాలతో గంగూలీ.. టీమిండియా నుంచి స్థానం కోల్పోయాడు. ఆ తరువాత ఎంట్రీ ఇచ్చి 2007 లో వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొన్న జట్టులో భాగమయ్యాడు. గ్రూప్ దశలోనే భారత్ వెనుదిరిగింది. అదే సంవత్సరంలో గంగూలీ ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతమైన ప్రదర్శనలు అందించాడు.

గంగూలీ 2008 లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ ప్రకటించాడు. తన చివరి టెస్టును ఆస్ట్రేలియాతో ఆడాడు. ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో దాదా 85 పరుగులు చేశాడు. కాగా, అప్పటి కెప్టెన్ ధోనీ నుంచి అద్భుతమైన మాటను అందుకున్నాడు. చివరి ఆటలో గంగూలీనే నాయకత్వం చేయమని ధోనీ పిలుపునిచ్చి, గంగూలీకి ఘనంగా వీడ్కోలు అందించాడు. పదవీ విరమణ అనంతరం వ్యాఖ్యతగా, గంగూలీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. 2015లో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అనంతరం అక్టోబర్ లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.

Also Read:

Wimbledon 2021: ఫెదరర్‌కు షాక్.. సెమీస్‌లోకి ఎంటరైన జకోవిచ్, షపొవలోవ్.. ముగిసిన సానియా-బోపన్న ప్రయాణం!

Abhimanyu Easwaran: ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ విషయంలో కోహ్లీ, చేతన్ శర్మల మధ్య విభేదాలు.. భారత క్రికెట్‌లో ఇలాంటివి ఎన్నో..!

India vs England: కౌంటీ బరిలో యాష్… ఇంగ్లండ్‌ సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌పై కన్నేసిన స్టార్ స్పిన్నర్!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!