Copa America Football: ఫైనల్ చేరిన అర్జెంటీనా.. కొలంబియాపై తిరుగులేని విజయం.. 15వ సారి కప్ కోసం..!

కోపా అమెరికా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో అర్జెంటీనా టీం తిరుగులేని ప్రదర్శన చేస్తోంది. సెమీఫైనల్లో కొలంబియాతో తలపడిన లయనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు.. పెనాల్టీ షూటౌట్‌లో 3-2తేడాతో విజయం సాధించింది.

Copa America Football: ఫైనల్ చేరిన అర్జెంటీనా.. కొలంబియాపై తిరుగులేని విజయం.. 15వ సారి కప్ కోసం..!
Copa America Football
Follow us
Venkata Chari

|

Updated on: Jul 08, 2021 | 7:49 AM

Copa America Football: కోపా అమెరికా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో అర్జెంటీనా టీం తిరుగులేని ప్రదర్శన చేస్తోంది. సెమీఫైనల్లో కొలంబియాతో తలపడిన లయనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు.. పెనాల్టీ షూటౌట్‌లో 3-2తేడాతో విజయం సాధించింది. దాంతో అర్జెంటీనా 29వసారి ఫైనల్లోకి ఎంటరైంది. అర్జెంటీనా ఆటగాడు మార్టినెజ్ 7 వ నిముషంలో గోల్ చేయగా, అనంతరం కొలంబియా ఆటగాడు దియాజ్ 61వ నిముషంలో గోల్ చేశాడు. దాంతో నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1 తో నిలిచాయి. ఎక్స్‌ట్రా టైంలో కొనసాగిన ఆటలో అర్జెంటీనా, కొలంబియా జట్లు గోల్స్‌ చేయలేదు. దాంతో షూటౌట్‌ లో అర్జెంటీనా జట్టు విజేతగా నిలిచింది.

ఇక ఆదివారం జరిగే ఫైనల్లో అర్జెంటీనా జట్టు బ్రెజిల్‌తో తేల్చకోనుంది. కోపా అమెరికా కప్‌ను అర్జెంటీనా జట్టు 14 సార్లు గెలుచుకుంది. చివరిసారిగా అర్జెంటీనా జట్టు 1993లో కోపా అమెరికా కప్‌ను గెలుచుకుంది.

Also Read:

Happy Birthday Sourav Ganguly: 49వ వసంతంలోకి బెంగాల్ టైగర్.. విదేశాల్లో విజయాలకు కేరాఫ్ అడ్రస్..!

Wimbledon 2021: ఫెదరర్‌కు షాక్.. సెమీస్‌లోకి ఎంటరైన జకోవిచ్, షపొవలోవ్.. ముగిసిన సానియా-బోపన్న ప్రయాణం!

Abhimanyu Easwaran: ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ విషయంలో కోహ్లీ, చేతన్ శర్మల మధ్య విభేదాలు.. భారత క్రికెట్‌లో ఇలాంటివి ఎన్నో..!