India vs Sri lanka: లంక ప్లేయర్లకు తప్పిన ప్రమాదం.. భారత్‌లో దిగిన విమానం..!
శ్రీలంక క్రికెటర్లు ఇంగ్లండ్ పర్యటన పూర్తి చేసుకుని విమానంలో స్వదేశం బయలుదేరారు. అయితే, వారు ప్రయాణిస్తున్న విమానానికి పెద్ద ప్రమాదం తప్పిందంట. సాంకేతిక సమస్యతో భారత్‌లో ల్యాడింగ్ చేశారు.
India vs Sri lanka: శ్రీలంక క్రికెటర్లు ఇంగ్లండ్ పర్యటన పూర్తి చేసుకుని విమానంలో స్వదేశం బయలుదేరారు. అయితే, వారు ప్రయాణిస్తున్న విమానానికి పెద్ద ప్రమాదం తప్పిందంట. సాంకేతిక సమస్యతో భారత్‌లో ల్యాడింగ్ చేశారు. దాంతో లంక క్రికెటర్లు.. సహాయ సిబ్బంది, ఆందోళనకు గురయ్యారంట. ఈ విషయాన్ని శ్రీలంక కోచ్ మైర్ ఆర్థర్ చెప్పడంతో విషయం బయటకు తెలిసింది. ‘ఇంధన నష్టం జరిగిందని, అందుకే విమానాన్ని ఇక్కడకు (భారత్) మళ్లించారు. దిగగానే నా ఫోన్ ఆన్ చేశాను. ఇంగ్లాండ్ ఆపరేషన్స్ మేనేజర్ వేన్ బెంట్లీ నుంచి కొన్ని మెసేజ్‌లు అందాయి. విమాన పరిస్థితి గురించి వివరించాను. దాంతో నిజంగా మేమంతా ఆందోళన చెందాం’ అని ఆర్థర్ పేర్కొన్నాడు. అనంతరం సమస్యను పరిష్కరించి, శ్రీలంక పంపించారు. మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీసు కోసం ఇంగ్లండ్‌లో లంక జట్టు పర్యటించింది. అయితే రెండు సిరీస్‌ల్లోనూ ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. టీ20 సిరీస్‌ను 3-0తో, వన్డే సిరీస్‌ను 2-0తో లంక జట్టు ఓడిపోయింది. ఈ పర్యటన అవ్వగానే లంక జట్టు స్వదేశానికి బయల్దేరారు. ఇంతలో ఇంధన సమస్యతో భారత్ లో ల్యాడింగ్ చేసి, సమస్యను పరిష్కరించారు. ఈ నెల 13 నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. కాగా, ఇంగ్లండ్ క్రికెటర్లు కరోనా బారిన పడటంతో, లంక క్రికెటర్లు కూడా ఐసోలేషన్‌లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు వన్డే సిరీస్‌లో మార్పులు ఉండే అవకాశం ఉండనుంది. అయితే, దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదివరకే ప్రకటించిన షెడ్యూల్ మేరకు ..భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే జులై 13న మొదలుకానుంది. అలాగే జూన్ 16న రెండో వన్డే, 18న మూడో వన్డే లో తలపడనున్నారు. వన్డే సిరీస్ అనంతరం జులై 21న తొలి టీ20, జులై 23న రెండో వన్డే, 25న మూడో వన్డే జరుగనున్నాయి.
ఇంతలో శ్రీలంక టీంకు షాక్ తగిలింది. కాంట్రాక్ట్‌పై సంతకం చేసేందుకు శ్రీలంక స్టార్ క్రికెటర్లు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో సీనియర్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈమేరకు త్వరలోనే బోర్డుకు సమాచారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. భారత్ తో జరిగే వన్డేలు, టీ20ల నుంచి సొంత పనుల కారణంగా మ్యాథ్యూస్ తప్పుకున్నట్లు లంక బోర్డు నిన్న పేర్కొంది. 2009లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మాథ్యూస్.. 90 టెస్టులు, 218 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. జాతీయ కాంట్రాక్ట్ విషయంలో ఎస్‌ఎల్‌సీ పైచేయి సాధించింది. మొత్తం 30 మందిలో 29 మంది లంక ఆటగాళ్లు కాంట్రాక్ట్ ఒప్పందాలపై సంతకం చేశారు.
Also Read:
Happy Birthday Sourav Ganguly: 49వ వసంతంలోకి బెంగాల్ టైగర్.. విదేశాల్లో విజయాలకు కేరాఫ్ అడ్రస్..!
MS Dhoni vs Gambhir: కోపంతో చేశాడా.. కావాలనే చేశాడా..? గంభీర్‌పై ధోనీ అభిమానుల ఫైర్!