AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni : జార్ఖండ్ ప్రభుత్వంలో ధోనీకి కీలక బాధ్యతలు?.. ఏ పదవి కట్టబెట్టారంటే ?

మహేంద్ర సింగ్ ధోనీ జార్ఖండ్ రాష్ట్రంలో క్రీడలు, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి సిద్ధమవుతున్నారు. అలాగే, శ్రావణి మేళాకు AI చాట్‌బాట్, 2026 నాటికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు డిజిటలైజేషన్ కానున్నాయి. ఈ కీలక పరిణామాలపై పూర్తి వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

MS Dhoni : జార్ఖండ్ ప్రభుత్వంలో ధోనీకి కీలక బాధ్యతలు?.. ఏ పదవి కట్టబెట్టారంటే ?
Ms Dhoni
Rakesh
|

Updated on: Jul 16, 2025 | 10:18 AM

Share

MS Dhoni : భారత క్రికెట్‌కు సరికొత్త నిర్వచనం ఇచ్చిన లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ, ఇప్పుడు తన సొంత రాష్ట్రం జార్ఖండ్‌కు సరికొత్త దిశానిర్దేశం చేయడానికి రెడీ అయ్యారు. క్రీడలు, పర్యాటక రంగాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధోనీ సలహాలు, సహకారం తీసుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే, రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ గవర్నెన్స్ వంటి అడ్వాన్సుడ్ టెక్నాలజీను ఉపయోగిస్తూ, రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. జార్ఖండ్ తీసుకుంటున్న ఈ కీలక నిర్ణయాలు, రాష్ట్ర భవిష్యత్తును పూర్తిగా మార్చబోతున్నాయి.

జార్ఖండ్ క్రీడలు, పర్యాటక రంగాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం మాజీ భారత క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సహకారం కోరుతోంది. ఈ విషయంపై ధోనీ, ఆ రాష్ట్ర పర్యాటక, కళలు-సంస్కృతి క్రీడా శాఖ మంత్రి సుదివ్య కుమార్ తో భేటీ అయ్యారు. క్రీడా మౌలిక సదుపాయాలు, పర్యాటక సామర్థ్యాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు. ధోనీ అనుభవం, నిబద్ధతతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయమై ధోనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

జార్ఖండ్‌లోని దేవ్ ఘర్ జిల్లా యంత్రాంగం ఒక కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. జూలై 11 నుంచి ప్రారంభమైన శ్రావణి మేళాకు వచ్చే భక్తులకు సహాయం చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ ను ప్రారంభించింది. ఒక లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోగలిగే ఈ చాట్‌బాట్, దేవ్ ఘర్ చరిత్ర, ఆలయ విశేషాలు, అలాగే మేళా సమయంలో భక్తులకు అవసరమైన అన్ని రకాల సమాచారం (రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, హాస్పిటల్, ఎయిర్‌పోర్ట్ వంటి వివరాలు) అందిస్తుంది. అంతేకాకుండా, మేళా ప్రాంతంలో రద్దీని నియంత్రించడానికి, భద్రతను పెంచడానికి, ఫేషియల్ రికగ్నిషన్, హెడ్‌కౌంట్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.

జార్ఖండ్ ప్రభుత్వం తమ అన్ని కార్యాలయాలను 2026 జనవరి నాటికి పూర్తిగా డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది. ప్రధాన కార్యదర్శి అల్కా తివారీ ఆధ్వర్యంలో ఈ చర్యలు ప్రారంభమయ్యాయి. సాంప్రదాయ పద్ధతులను పక్కన పెట్టి, కార్యకలాపాలను పూర్తిగా టెక్నాలజీ బెస్డ్ ‘ఈ-ఆఫీస్’ సిస్టమ్ లోకి మార్చాలని చూస్తున్నారు. ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఈ-ఆఫీస్ లైట్ కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. గడువులోగా అన్ని శాఖల్లోనూ ఈ వ్యవస్థ ఎలాంటి లోపాలు లేకుండా పనిచేసేలా చూడాలని ఐటీ విభాగాన్ని ఆదేశించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..